NTV Telugu Site icon

Pakistan Record: న్యూజిలాండ్‌పై రికార్డు సృష్టించిన పాకిస్థాన్

Pakistan Record

Pakistan Record

Pakistan Record: టీ20 ప్రపంచకప్ సెమీస్‌లో న్యూజిలాండ్‌పై గెలిచి పాకిస్తాన్ రికార్డు సృష్టించింది. ఒక జట్టుపై అత్యధిక టీ20 మ్యాచ్‌లు గెలిచిన జట్టుగా నిలిచింది. అంతర్జాతీయ టీ20 ఫార్మాట్‌లో న్యూజిలాండ్‌పై పాకిస్తాన్‌కు ఇది 18వ విజయం. ఇన్ని మ్యాచ్‌ల్లో మరే జట్టు ప్రత్యర్థిపై గెలుపొందలేదు. ఇప్పటివరకు పాకిస్థాన్‌పై 17 మ్యాచ్‌ల్లో గెలిచిన రికార్డు ఇంగ్లండ్‌పై ఉంది. శ్రీలంక, వెస్టిండీస్‌పై కూడా భారత్ 17 మ్యాచ్‌ల్లో గెలిచింది. ఇప్పుడు ఆ జట్లను పాకిస్థాన్ అధిగమించి సరికొత్త రికార్డును తన ఖాతాలో వేసుకుంది. ఈనెల 13న టీ20 ప్రపంచకప్ ఫైనల్‌లో పాకిస్థాన్ ఇండియా లేదా ఇంగ్లండ్‌లతో తలపడనుంది. భారత్-పాకిస్థాన్ గతంలో 2007లో టీ20 ప్రపంచకప్ ఫైనల్లో తలపడ్డాయి. ఆ తర్వాత టీ20 ప్రపంచకప్ నాకౌట్ దశలో ఈ రెండు జట్లు తలపడలేదు.

Read Also: IPL 2023: ఐపీఎల్ మినీ వేలానికి ముహూర్తం ఖరారు.. అదృష్టవంతులు ఎవరో?

కాగా టీ20 వరల్డ్ కప్ ఆద్యంతం పాకిస్తాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్, భారత అభిమానుల మధ్య సోషల్ మీడియాలో వార్ నడుస్తూనే ఉంది. తాజాగా పాకిస్థాన్ ఫైనల్ చేరడంతో ఆ జట్టు మాజీ ఆటగాళ్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తమ జట్టు ప్రతిభ మరోసారి చాటుకుందని ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో షోయబ్ అక్తర్ మరో ట్వీట్ చేశాడు. ‘డియర్ ఇండియా. రేపటి మ్యాచ్ కోసం ఆల్ ది బెస్ట్. ఒక గొప్ప క్రికెట్ గేమ్ కోసం మేము మీ కోసం మెల్‌బోర్న్‌లో వెయిట్ చేస్తుంటాం’ అని అన్నాడు. దీంతో ‘వస్తున్నాం.. రెడీగా ఉండండి’ అని అక్తర్‌కు టీమిండియా అభిమానులు ధీటుగా బదులిస్తున్నారు. అటు ఇప్పటివరకు 8 సార్లు టీ20 ప్రపంచకప్ జరగ్గా ఆరుసార్లు పాకిస్థాన్ సెమీస్ వరకు వెళ్లింది. ఒక్కసారి విశ్వవిజేతగా నిలవగా నాలుగు సార్లు సెమీస్‌లోనే వెనుతిరగ్గా.. 2007లో మాత్రం భారత్ చేతిలో ఓటమి పాలైంది.