Site icon NTV Telugu

అత్యాచారం కేసులో చిక్కుకున్న స్టార్ క్రికెటర్

పాకిస్థాన్ క్రికెటర్ల రాసలీలలు వరుసగా వెలుగు చూస్తున్నాయి. గతంలో షోయబ్ అక్తర్, షాహిద్ అఫ్రిది, బాబర్ ఆజంపై రాసలీలల ఆరోపణలు వెలుగు చూడగా… తాజాగా పాకిస్థాన్ స్టార్ క్రికెటర్ యాసిర్ షా అత్యాచారం కేసులో చిక్కుకోవడం సంచలనంగా మారింది. యాసిర్‌ షా, అతడి స్నేహితుడు ఫర్హాన్‌ తనను వేధించారని ఇస్లామాబాద్‌కు చెందిన 14 ఏళ్ల బాలిక చేసిన ఆరోపణలు చేసింది. ఫర్హాన్‌ను పెళ్లి చేసుకోవాలని యాసిర్‌ షా తనకు ఫోన్‌ చేసి బెదిరించినట్లు బాధితురాలు పేర్కొంది. ఈ నేపథ్యంలో యాసిర్‌ షాపై పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. త్వరలో బాలికకు వైద్య పరీక్షలు నిర్వహించి తదుపరి చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.

Read Also: స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధుకు అరుదైన గౌరవం

ఫర్హాన్ తనకు ఉన్నతాధికారులు చాలా మంది తెలుసని.. పోలీసులను సంప్రదించిన సమయంలో యాసిర్ షా తనకు డబ్బులు ఇస్తానని ప్రలోభాలకు గురిచేశాడని బాలిక ఆరోపించింది. కాగా యాసిర్ షా పాకిస్థాన్ దిగ్గజ స్పిన్నర్లలో ఒకడు. లెగ్ స్పిన్నర్‌గా అతడు 46 టెస్టుల్లో 235 వికెట్లు తీశాడు. అటు 25 వన్డేలు ఆడి 24 వికెట్లు పడగొట్టాడు.

Exit mobile version