Oval Test Thriller: ఆండర్సన్- టెండూల్కర్ సిరీస్ లోని చివరి టెస్టు రసవత్తరంగా కొనసాగుతుంది. ఈ ఓవల్ వేదికగా జరుగుతున్న ఐదో టెస్టులో భారత్ తమ విజయానికి తొమ్మిది వికెట్ల దూరంలో నిలవగా.. ఇంగ్లాండ్ గెలుపుకు 324 పరుగులు కావాల్సి ఉంది. అయితే, ఐదో టెస్ట్ రెండో ఇన్సింగ్స్ లో 374 రన్స్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఇంగ్లీష్ జట్టు మూడో రోజు ఆట ముగిసే సరికి వికెట్ నష్టానికి 50 పరుగులు చేసింది. ఇక, నేడే మ్యాచ్ ఫలితంపై క్లైమాక్స్ రానుంది. ఎలాగైనా ఇంగ్లాండ్‌ను ఆలౌట్ చేసి సిరీస్‌ను సమానం చేయాలని భారత ప్లాన్ చేస్తుండగా.. సిరీస్‌ను 3-1 తేడాతో సొంతం చేసుకోవాలని ఇంగ్లాండ్ వ్యూహాలు రచిస్తోంది.
Read Also: LIC Bima Sakhi: మహిళల కోసం ఎల్ఐసీ గొప్ప పథకం.. ఒక్క రూపాయి కట్టకుండానే.. నెలకు రూ. 7000 పొందే ఛాన్స్
ఈ నేపథ్యంలో లండన్‌లోని ఓవల్ మైదానంలో 1880లో తొలి మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా- ఇంగ్లాండ్ జట్లు పోటీపడ్డాయి. 145 ఏళ్ల ఈ మైదానం చరిత్రలో 300 రన్స్ కంటే ఎక్కువ టార్గెట్ ను ఒక్కసారి కూడా ఛేదించలేదటా.. ఈ స్టేడియంలో అత్యధిక రన్ ఛేజ్ చేసిన రికార్డు ఇంగ్లాండ్ జట్టు పేరుపై ఉంది. 1902లో ఆసీస్ తో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లీష్ టీమ్ 263 రన్స్ లక్ష్యాన్ని చేధించింది. అయితే, ఈ మ్యాచ్‌లో ఒక్క వికెట్ తేడాతో ఇంగ్లాడ్ గెలిచింది. ఆ తర్వాత రెండో అత్యధిక రన్ చేజ్ వెస్టిండీస్ పేరుపై ఉంది.
1963లో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో విండీస్ 252 పరుగుల టార్గెట్ చేధించింది.
Read Also: Kodali Nani: మాజీ మంత్రి కొడాలి నానిపై మరో కేసు..
ఇక, ఓవల్ మైదానంలో మూడో అత్యంత విజయవంతమైన రన్ చేజ్‌గా 1972లో ఆస్ట్రేలియా జట్టు ఇంగ్లాండ్‌పై 242 రన్స్ లక్ష్యాన్ని విజయవంతంగా చేధించింది. ఇక, ఈ మైదానంలో చివరగా 2024లో శ్రీలంక ఇంగ్లండ్‌పై 219 రన్స్ చేజ్ చేయగా.. ఇది ఓవల్‌లో ఐదో అత్యంత సక్సెస్ ఫుల్ రన్ చేజ్‌గా నిలిచింది. అయితే, ఇప్పుడు భారత్ విధించిన టార్గెట్ ను ఛేదిస్తే 123 ఏళ్ల చరిత్రను ఇంగ్లాండ్ జట్టు తిరగరాసినట్లు అవుతుంది.