Site icon NTV Telugu

Mohammed Shami Retirement: రిటైర్‌మెంట్ నా నిర్ణయం- ఆటపై విసుగు వచ్చేవరకు ఆడుతా..

Shami

Shami

Mohammed Shami Retirement: టెస్టు క్రికెట్‌కు ఇప్పటికే ముగ్గురు సీనియర్‌ క్రికెటర్లు గుడ్ బై చెప్పేశారు. ఆ తర్వాత లిస్ట్‌లో మహ్మద్ షమీ పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. రెండేళ్ల క్రితం చివరి టెస్టు మ్యాచ్‌ ఆడిన షమీ.. అప్పటి నుంచి తుది జట్టులో స్థానం దక్కించుకోలేకపోయాడు. ఈ ఏడాది న్యూజిలాండ్‌తో వన్డే, ఇంగ్లాండ్‌పై టీ20 మ్యాచ్ ఆడిన షమీ.. గాయాలతో ఇబ్బంది పడుతున్నాడు. వన్డే ప్రపంచకప్‌ 2027 టోర్నీలో ఆడటమే తన లక్ష్య్ం అని పేర్కొన్నాుడ. ఈ క్రమంలో తన రిటైర్‌మెంట్‌పై వస్తోన్న వార్తలను కొట్టిపడేశాడు. నా రిటైర్‌మెంట్ ఎవరి చేతుల్లోనూ లేదన్నారు.. ఆటపై విసుగు వచ్చేవరకూ ఆడుతానని షమీ క్లారిటీ ఇచ్చారు.

Read Also: Trump-Modi: ట్రంప్ సుంకాలతో వచ్చే నష్టమేంటి? భారత్ ప్లాన్ ఏంటి?

అయితే, ఎవరికైనా సమస్య ఉంటే.. నేను రిటైర్‌మెంట్‌ తీసుకుంటే వారి జీవితాలు బాగుపడతాయని నాతోటి చెప్పండి.. అప్పుడు ఆలోచిద్దాం అని మహ్మద్ షమీ ప్రశ్నించారు. ఇక, ఇప్పట్లో నేను ఆటకు వీడ్కోలు పలకాలని కోరుకొనేంతగా ఎవరికైనా ఇబ్బంది ఉందా.. ఆట ఆడాలని ఇంట్రెస్ట్ పోతుందో.. అప్పుడు వదిలేస్తానన్నారు. అంతేకానీ, మీరు నిర్ణయం తీసుకోవద్దు అని చురకలు అంటించాడు. నన్ను ఒకవేళ అంతర్జాతీయ క్రికెట్‌కు సెలక్ట్ చేయకపోతే.. దేశవాళీలో ఆడతా.. ఎక్కడైనా ఆడేందుకు రెడీగా ఉన్నాను.. మీకు బోర్‌ కొట్టినప్పుడల్లా నా రిటైర్‌మెంట్‌ గురించి ఆలోచించండి అని షమీ కామెంట్స్ చేశాడు.

Read Also: US: ట్రంప్‌ను చంపేయండి.. విద్యార్థులపై కాల్పులు జరిపిన నిందితుడి తుపాకీపై రాతలు

ఇక, గత రెండు నెలల్లో నా ఫిట్‌నెస్‌ చాలా మెరుగుపర్చుకున్నాను.. నా నైపుణ్యాలకూ మరింత పదును పెట్టా.. బరువును కూడా అదుపులోకి తెచ్చుకున్నాను అని షమీ తెలిపారు. సుదీర్ఘంగా బౌలింగ్ వేయడం పైనే ప్రధానంగా దృష్టి పెట్టాను.. ఒక్కసారి రిథమ్‌ను అందుకొంటే చాలు.. బ్యాటింగ్, ఫీల్డింగ్‌ విషయంలోనూ కఠినంగా ప్రాక్టీస్ చేస్తున్నాను అని వెల్లడించారు.

Exit mobile version