Site icon NTV Telugu

World Cup 2023: వన్డే వరల్డ్ కప్ కు టీమిండియా జట్టు ఇదే..!

Haden

Haden

వన్డే వరల్డ్ కప్-2023కు కౌంట్‌ డౌన్‌ స్టార్ట్ అయింది. అక్టోబర్‌ 5న అహ్మదాబాద్‌ వేదికగా న్యూజిలాండ్‌-ఇంగ్లండ్‌ మధ్య జరగనున్న తొలి మ్యాచ్‌తో ఈ మెగా ఈవెంట్ ప్రారంభం కానుంది. ఈ మెగా టోర్నమెంట్ కోసం ఇంగ్లండ్‌, ఆస్ట్రేలియా లాంటి ఆగ్రశ్రేణి టీమ్స్‌ ఇప్పటికే తమ ప్రిలిమనరీ టీమ్స్ ను కూడా ప్రకటించాయి. మరోవైపు భారత జట్టు కూడా వరల్డ్‌కప్‌ వైపు అడుగులు వేస్తోంది.

Read Also: Flexi War in Khammam: అమిత్ షా సభలో ప్లెక్సీ వార్‌… ఈటల వర్గీయులు వార్నింగ్ ?

ఈ మెగా టోర్నీకి ముందు ఆసియాకప్‌లో టీమిండియా ఆడనుంది. ఈ క్రమంలో ఆసియాకప్‌కు 17 మంది ప్లేయర్స్ తో కూడిన టీమ్ ను అగర్కార్‌ నేతృత్వంలోని సెలక్షన్‌ కమిటీ ఎంపిక చేసింది. ఈ జట్టునే వరల్డ్‌కప్‌కు కూడా కొనసాగించే ఛాన్స్ ఉంది. ఇందులో 15 మ​ంది సభ్యులను ఖారారు చేసి సెప్టెంబర్‌ 15లోపు ఐసీసీకి బీసీసీఐ టీమిండియా జట్టు వివరాలను సమర్పించనుంది. కాగా, ఈ మెగా టోర్నీతో స్టార్‌ ఆటగాళ్లు కేఎల్‌ రాహుల్‌, శ్రేయస్ అయ్యారు కూడా బరిలోకి దిగుతున్నారు.

Read Also: ICC ODI rankings: వన్డేల్లో నెంబర్-1 స్థానానికి పాకిస్థాన్.. టీమిండియా ర్యాంక్..?

ఇక, ఇది ఇలా ఉండగా.. వరల్డ్‌కప్‌ కోసం 15 మంది సభ్యులతో కూడిన టీమిండియా జట్టును ఆస్ట్రేలియా దిగ్గజం మాథ్యూ హేడెన్ ఎంపిక చేశాడు. అతడు ఎంపిక చేసిన టీమ్ లో మణికట్టు స్పిన్నర్లు కుల్దీప్‌ యాదవ్‌, యజువేంద్ర చాహల్‌కు చోటు దక్కకపోవడం గమనార్హం. అదే విధంగా వికెట్‌ కీపర్లగా ఇషాన్‌ కిషన్‌, సంజూ శాంసన్‌ ఇద్దరికీ హేడన్‌ అవకాశం ఇచ్చాడు.

Read Also: Top Headlines @9AM : టాప్‌ న్యూస్‌

స్పెషలిస్ట్‌ స్పిన్నర్లగా రవీంద్ర జడేజా, అక్షర్‌పటేల్‌కు మాత్రమే హేడెన్ ఎంపిక చేసిన జట్టులో చోటు దక్కింది. అదే విధంగా స్పెషలిస్ట్‌ బ్యాటర్లగా రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లి, శుబ్‌మన్‌ గిల్‌, శ్రేయస్‌ అయ్యర్‌కు హేడన్‌ ఛాన్స్ ఇచ్చాడు. మరోవైపు సిరాజ్‌, మహ్మద్‌ షమీ, జస్ప్రీత్‌ బుమ్రా, శార్ధూల్‌ ఠాకూర్‌ రూపంలో నలుగురు పేసర్లు ఆయన ఎంపిక చేసిన జట్టులో ఉన్నారు.

Read Also: Harish Rao: సిద్దిపేటలో హరీష్‌ రావు పర్యటన.. కోమటి చెరువులో 4500 డ్రోన్లతో షో

మథ్యూ హేడన్‌ ఎంపిక చేసిన టీమిండియా జట్టు ఇదే: రోహిత్ శర్మ (కెప్టెన్‌), జస్ప్రీత్ బుమ్రా, విరాట్ కోహ్లీ, శుభ్‌మన్ గిల్, శ్రేయాస్ అయ్యర్, సంజూ శాంసన్, కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, హార్దిక్ పాండ్యా, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, శార్దూల్ ఠాకూర్, ఇషాన్ కిషన్, అక్షర్ పటేల్ ఉన్నారు.

Exit mobile version