73 ఏండ్ల ప్రతిష్టాత్మక థామస్ కప్ లో సరికొత్త చరిత్రను సృష్టించిన భారత బ్యాడ్మింటన్ జట్టుపై ప్రశంసలు వెల్లువెత్తున్నాయి. ఈ విజయం అపూర్వమని, భారత బ్యాడ్మింటన్ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన రోజని టీమిండియా క్రికెటర్లు కొనియాడుతున్నారు. 14 సార్లు ఛాంపియన్ అయిన ఇండోనేషియాను టీమిండియా.. 3-0తో మట్టి కరిపించి థామస్ కప్-2022 స్వర్ణాన్ని చేజిక్కించుకున్న విషయం తెలిసిందే. అయితే.. వీరి విజయ దుందుభికి దేశం మొత్తం హర్షధ్వానాలు వినిపిస్తున్నాయి.
అందరూ ఈ విజయంపై ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో.. భారత ప్రభుత్వం థామస్ కప్ గెలిచిన భారత బ్యాడ్మింటన్ జట్టుకు భారీ నజరానా ప్రకటించింది. భారత బ్యాడ్మింటన్ జట్టుకు భారత ప్రభుత్వం కోటి రూపాయల బహుమతి ప్రకటించినట్లు కేంద్ర క్రీడాశాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ వెల్లడించారు. అయితే ఇప్పటికే… భారత బ్యాడ్మింటన్ క్రీడాకారులపై ప్రధాని మోదీ ప్రశంసలు కురిపించారు.
