NZ vs IND 3rd ODI: హామిల్టన్‌లో వరుణుడి ఆట.. భారత్-న్యూజిలాండ్ మూడో వన్డే రద్దు!

Nz Vs Ind 3rd Odi

Nz Vs Ind 3rd Odi

IND vs NZ 3rd ODI Abandoned: వన్డే సిరీస్‌లో భాగంగా హామిల్టన్‌లోని సెడ్డన్ పార్క్ వేదికగా భారత్, న్యూజిలాండ్ మధ్య జరగాల్సిన మూడో మ్యాచ్ భారీ వర్షం కారణంగా ఒక్క బంతి పడకుండానే రద్దయింది. టాస్‌కు ముందు నుంచే భారీ వర్షం కురవడంతో మైదానం పూర్తిగా చిత్తడిగా మారింది. వర్షం తగ్గినప్పటికీ.. మైదానాన్ని మ్యాచ్‌కు సిద్ధం చేసేందుకు మరింత సమయం పట్టే అవకాశం ఉండటంతో అంపైర్లు మూడో వన్డేను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.

షెడ్యూల్ ప్రకారం ఉదయం 7 గంటలకు టాస్‌ వేయాలి. కానీ వర్షం కారణంగా రెండు గంటలు ఆలస్యం అయింది. దాంతో మ్యాచ్‌ను 40 ఓవర్లకు అంపైర్లు కుదించారు. టాస్ గెలిచిన భారత జట్టు తొలుత బౌలింగ్ ఎంచుకుంది. టాస్ వేయగానే మళ్లీ చినుకులు పడడంతో.. పిచ్‌ను కవర్లతో కప్పేశారు. కాసేపటికి వర్షం పూర్తిగా తగ్గింది. దీంతో మ్యాచ్‌ నిర్వహణకు అంపైర్లు సిద్ధమయ్యారు. మ్యాచ్‌ ప్రారంభమవుతుందనే సమయంలోనే వర్షం మరలా వచ్చేసింది. హామిల్టన్‌లో బాగా వర్షం పడింది. పరిస్థితులు అనుకూలించకపోవడంతో చివరకు మ్యాచ్‌ను పూర్తిగా రద్దు చేయాల్సి వచ్చింది.

మూడో వన్డే రద్దయినప్పటికీ ఐదు వన్డేల సిరీస్‌లో భారత్ 2-0తో ఆధిక్యంలో కొనసాగుతోంది. సిరీస్‌లో ఇంకా రెండు మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. వీటిలో ఒక్క మ్యాచ్‌లో విజయం సాధించినా.. టీమిండియా సిరీస్‌ను కైవసం చేసుకుంటుంది. మరోవైపు సిరీస్‌పై ఆశలు నిలుపుకోవాలంటే న్యూజిలాండ్ మిగిలిన రెండు మ్యాచ్‌ల్లోనూ గెలవాల్సి ఉంటుంది. ప్రస్తుత టీమిండియా ఫామ్ చూస్తే.. సిరీస్ సొంతం అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇప్పటికే పొట్టి సిరీస్‌ను శ్రేయాస్ సేన గెలిచిన విషయం తెలిసిందే.