NTV Telugu Site icon

Novak Djokovic: ఆస్ట్రేలియన్ ఓపెన్ నుంచి వైదొలిగిన జకోవిచ్‌..

Djokovic

Djokovic

Novak Djokovic: తన కెరీర్‌లో 25వ గ్రాండ్‌స్లామ్‌ను దక్కించుకోవాలని పట్టుదలతో ఉన్న సెర్బియా టెన్నిస్ స్టార్‌ జకోవిచ్‌ను గాయంతో తీవ్ర ఇబ్బంది పడ్డారు. దీంతో ఆస్ట్రేలియన్ ఓపెన్ 2025 సెమీస్‌లో అలెగ్జాండర్‌ జ్వెరెవ్‌పై మ్యాచ్‌లో బరిలోకి దిగి తొలి సెట్‌ తర్వాత రిటైర్డ్‌హర్ట్‌ ప్రకటించి బయటకు వెళ్లిపోయాడు. గాయంతోనే ఈ నిర్ణయం తీసుకొన్నట్లు పేర్కొన్నాడు. జోక్ నిర్ణయంతో అభిమానులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఈ నేపథ్యంలో జర్మనీ స్టార్ జ్వెరెవ్‌ ఆస్ట్రేలియన్‌ ఓపెన్ ఫైనల్‌కు వెళ్లాడు. ఈరోజు జరగనున్న రెండో సెమీస్‌లో విజేతగా నిలిచే ప్లేయర్ తో అతడు టైటిల్‌ కోసం బరిలోకి దిగనున్నాడు.

Read Also: Mumbai Crime: మహిళపై ఆటో డ్రైవర్ అత్యాచారం.. ప్రైవేట్ భాగాల్లో రాళ్లు, బ్లేడ్!

అయితే, ఇటలీకి చెందిన డిఫెండింగ్ ఛాంపియన్‌ సినర్‌తో అమెరికా సంచలనం బెన్ షెల్టన్ మరో సెమీస్‌లో పోటీ పడబోతున్నాడు. ఆదివారం నాడు ఫైనల్‌ మ్యాచ్ జరగనుంది. ఇక, ఛాంపియన్స్ పోటీలో ఉంటే.. గేమ్ ఎలా ఉంటుందనే దానికి ఆస్ట్రేలియన్ ఓపెన్ తొలి సెమీస్‌ మంచి ఉదాహరణగా చెప్పుకోవాలి. ఓ వైపు గాయంతో ఇబ్బంది పడుతున్నా.. జకోవిచ్‌ మాత్రం అద్భుతమైన ప్రదర్శన కనబర్చాడు. కానీ, జ్వెరెవ్‌ కూడా దూకుడై ఆటతో దాదాపు గంట 21 నిమిషాల పాటు తొలి సెట్‌ సాగింది. మొదటి సెట్ ను జ్వెరెవ్‌ 7-6 (7/5) తేడాతో దక్కించుకున్నాడు. ఒక్కో పాయింట్‌ కోసం ఇరువురూ తీవ్రంగా పోటీ పడ్డారు. ఒకరి సర్వీస్‌ను మరొకరు బ్రేక్‌ చేసుకుంటూ ముందుకెళ్లారు. కానీ, చివరికి జ్వెరెవ్‌ గెలవగా.. తొలి సెట్‌ ముగియగానే జకోవిచ్ టోర్నీ నుంచి తప్పుకున్నాడు.