భారత్- ఇంగ్లండ్ జట్ల మధ్య జరిగిన ఐదో టీ20లో టీమిండియా ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. 150 పరుగుల తేడాతో గెలిచి ఇంగ్లీష్ జట్టును మట్టికరింపించింది. ఐదు టీ20 మ్యాచ్ ల సరీస్ లో 4-1 అధిక్యంతో భారత్ సిరీస్ కైవసం చేసుకుంది. అయితే ఈ మ్యాచ్ అసలు సిసలైన హీరో ఎవరంటే అభిషేక్ శర్మ అని చెప్పాలి. తన విధ్వంసకర బ్యాటింగ్ తో ఇంగ్లండ్ జట్టు ఆటకట్టించాడు. మెరుపు బ్యాటింగ్ తో పరుగుల వరద పారించాడు. అభిషేక్ బ్యాటింగ్ ధాటికి ఇంగ్లండ్ విలవిల్లాడిపోయింది. అభిషేక్ బాదిన సిక్సుల మోతతో వాంఖడే స్టేడియం దద్దరిల్లింది. క్రికెట్ లవర్స్ లో ఫుల్ జోష్ నింపాడు.
అభిషేక్ శర్మ ఇంగ్లండ్ బౌలర్లను చిత్తు చేస్తూ 54 బంతుల్లోనే 7 ఫోర్లు, 13 సిక్సులతో విరుచుకుపడి 135 పరుగులు సాధించాడు. కేవలం 37 బంతుల్లోనే సెంచరీ కొట్టి అంతర్జాతీయ టీ20ల్లో భారత్ తరపున ఫాస్టెస్ట్ సెంచరీ సాధించిన రెండో ప్లేయర్ గా అభిషేక్ శర్మ చరిత్ర సృష్టించాడు. కాగా అభిషేక్ అద్భుతమైన ఇన్నింగ్స్ పై క్రికెట్ ఫ్యాన్స్, టీమిండియా ప్లేయర్స్ ప్రశంసలు కురిపించారు. కాగా తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డి కాస్త వెరైటీగా ప్రశంసించాడు. అభిషేక్ శర్మపై ఊర మాస్ కామెంట్ తో సోషల్ మీడియాను షేక్ చేశాడు.
నితీశ్ కుమార్ రెడ్డి తన ఇన్‌స్టాగ్రామ్‌లో అభిషేక్ శర్మను ప్రశంసిస్తూ “మెంటల్ నా కొడుకు” అంటూ పోస్టు చేశాడు. ‘సలార్’ మూవీ క్లైమాక్స్‌లో ప్రభాస్ కత్తితో ఉన్న ఫొటోతో పాటు కింద అభిషేక్ ఫొటోను యాడ్ చేశాడు నితీష్. క్షణాల్లోనే ఇన్ స్టా స్టోరీ వైరల్ గా మారింది. ఇది చూసిన నెటిజన్స్ ఏంటీ బ్రో అంత మాట అన్నావ్ అంటూ కామెంట్ చేస్తున్నారు. మరికొందరు అభిషేక్ నిజంగానే మెంటలోడు అంటూ ఫన్నీగా రియాక్ట్ అవుతున్నారు.
Nitish Kumar Reddy’s instagram story for Abhishek Sharma. 🔥 pic.twitter.com/H5VjG0CMuG
— CricketGully (@thecricketgully) February 2, 2025