NTV Telugu Site icon

Nikhat Zareen: చరిత్ర సృష్టించిన జరీన్.. బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణం

Nikhat Zareen Gold Medal

Nikhat Zareen Gold Medal

Nikhat Zareen Won Gold Medal In Women World Boxing Championship 2023: భారత మహిళల బాక్సింగ్ హిస్టరీలో నిఖత్ జరీన్ సరికొత్త చరిత్ర సృష్టించింది. మహిళల ప్రపంచ బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌ 2023లో స్వర్ణ పతకం సొంతం చేసుకుంది. 50 కేజీల విభాగంలో ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో.. వియత్నాంకు చెందిన థామ్‌ గుయేన్‌ను నిఖిత్ 5-0 తేడాతో చిత్తు చేసింది. తొలి రౌండ్ నుంచే ప్రత్యర్థిపై నిఖత్ ఆధిపత్యం ప్రదర్శించింది. తనపై ఆధిపత్యం చెలాయించే ఆస్కారం ప్రత్యర్థికి ఇవ్వలేదు. రెండో రౌండ్‌లో వియత్నాం బాక్సర్ కాస్త పుంజుకుంది కానీ, మూడో రౌండ్‌లో నిఖత్ పూర్తిగా రెచ్చిపోయింది. మూడు నిమిషాల పాటు ఏకధాటిగా ప్రత్యర్థిపై పిడుగుల వర్షం కురిపించింది. దీంతో.. ఈ మ్యాచ్ నిఖత్ వశం కావడంతో, బంగారం గెలిచింది. దీంతో ఆమె రెండోసారి వరల్డ్ ఛాంపియన్‌గా నిలిచింది. భారత బాక్సర్ మేరీకోమ్ తర్వాత వరుసగా రెండుసార్లు వరల్డ్ ఛాంపియన్‌షిప్ టైటిల్స్ నెగ్గిన రెండో భారత బాక్సర్‌గా నిఖత్ నిలిచింది. ఈ నేపథ్యంలోనే ఆమెపై నెటింట్లో ప్రశంసల వర్షం కురుస్తోంది. అభిమానుల దగ్గర నుంచి ప్రముఖుల దాకా.. నిఖిత్‌ని మెచ్చుకుంటున్నారు.

Smriti Irani: సిగ్గులేదా.. నీకు అని అతడు నన్ను అవమానించాడు

ఇదిలావుండగా.. మహిళల బాక్సింగ్ చాంపియన్‌షిప్ 2023లో భారత్‌కు ఇది మూడో టైటిల్. శనివారం భారత్‌కు ఏకంగా రెండు బంగారు పతకాలొచ్చాయి. 81 కిలోల విభాగంలో ఫైనల్ మ్యాచ్‌లో హరియాణాకు చెందిన స్వీటీ బూరా, చైనాకు చెందిన వాంగ్ లినాపై 4-3 తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో ఇద్దరి మధ్య హోరాహోరీ పోరు సాగింది. ఒకానొక దశలో వాంగ్ లినా ఆధిపత్యం చెలాయించింది. కానీ.. స్వీటీ ఆ తర్వాత పుంజుకుని ప్రత్యర్థిని ఓడించింది. ఇక 48 కిలోల విభాగంలో.. మంగోలియాకు చెందిన లుత్సాయిఖాన్‌పై నీతూ గాంగాస్‌ 5-0 తేడాతో విజయఢంకా మోగించింది. భారత్‌కు చెందిన మేరీకోమ్‌ (ఆరుసార్లు), సరితా దేవి, జెన్నీ ఆర్‌ఎల్‌, లేఖ కేసీ, నిఖత్‌ జరీన్‌ (రెండు సార్లు) ఇప్పటి వరకు ప్రపంచ ఛాంపియన్లుగా అవతరించారు. ఇప్పుడు వారి సరసన తాజాగా నీతూ, స్వీటీ బూరా చేరిపోయారు.

YCP Leader KSN Raju: ఎమ్మెల్యే రాపాకను ప్రలోభ పెట్టిన మాట వాస్తవమే.. వైసీపీ లీడర్ క్లారిటీ