NTV Telugu Site icon

IND Vs NZ: రెండో టీ20లో టాస్ గెలిచిన న్యూజిలాండ్.. శుభ్‌మన్ గిల్‌కు దక్కని అవకాశం

Toss

Toss

IND Vs NZ: టీ20 ప్రపంచకప్ నుంచి నిష్క్రమించిన తర్వాత టీమిండియా నేరుగా న్యూజిల్యాండ్ పర్యటనకు వెళ్లింది. అక్కడ మూడు టీ20లు, మూడు వన్డేల సిరీస్‌ను భారత్ ఆడనుంది. ఈ క్రమంలోనే ఆదివారం నాడు రెండో టీ20 జరగనుంది. బే ఓవల్ మైదానం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. దీంతో టీమిండియా తొలుత బ్యాటింగ్ చేయనుంది. హార్దిక్ పాండ్యా నేతృత్వంలోని టీమిండియా యువ ఆటగాళ్లతో పటిష్టంగా కనిపిస్తోంది. అయితే తుది జట్టులో శుభ్‌మన్ గిల్‌కు చోటు దక్కలేదు.

ఆశ్చర్యకరంగా ఓపెనర్లుగా ఇషాన్ కిషన్, రిషబ్ పంత్ బరిలోకి దిగనున్నారు. సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్, దీపక్ హుడా, హార్దిక్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్‌తో మిడిలార్డర్ కూడా బలంగానే కనిపిస్తోంది. ముగ్గురు ఆల్‌రౌండర్లతో పాటు భువనేశ్వర్, అర్ష్‌దీప్ సింగ్, మహ్మద్ సిరాజ్, చాహల్‌తో బౌలింగ్ విభాగం కూడా పటిష్టంగానే ఉంది. మరి గ్రౌండ్‌లో భారత జట్టు ఎలా ఆడుతుందో వేచి చూడాలి. మూడు టీ20ల సిరీస్‌లో ఇప్పటికే తొలి టీ20 వర్షం కారణంగా రద్దయిన సంగతి తెలిసిందే.

తుది జట్ల వివరాలు
భారత జట్టు: ఇషాన్ కిషన్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, శ్రేయాస్ అయ్యర్, దీపక్ హుడా, హార్దిక్ పాండ్య, వాషింగ్టన్ సుందర్, భువనేశ్వర్ కుమార్, అర్షదీప్ సింగ్, మహ్మద్ సిరాజ్, చాహల్
న్యూజిలాండ్ జట్టు: ఫిన్ అలెన్, డెవాన్ కాన్వే, విలియమ్సన్, ఫిలిప్స్, డారిల్ మిచెల్, జేమ్స్ నీషమ్, సాంట్నర్, సోథీ, సౌదీ, ఆడమ్ మిల్నే, ఫెర్గుసన్

Show comments