T20 World Cup: టీ20 ప్రపంచకప్‌లో అసలు సిసలు పోరు ఈరోజే ప్రారంభమైంది. సూపర్-12లో భాగంగా సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియా-న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న మ్యాచ్ రసవత్తరంగా సాగుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో న్యూజిలాండ్ తొలుత బ్యాటింగ్ చేసి నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా ముందు 201 పరుగులు భారీ టార్గెట్ నిలిచింది. న్యూజిలాండ్ ఓపెనర్ డెవాన్ కాన్వే 92 పరుగులతో తుదికంటా నాటౌట్‌గా నిలిచాడు. కాన్వే 58 బంతులు ఆడి 7 ఫోర్లు, 2 సిక్సర్లు బాదాడు. మరో ఓపెనర్ ఫిన్ అలెన్ 42 పరుగులతో రాణించాడు. కెప్టెన్ కేన్ విలియమ్సన్ 23 పరుగులు చేసి అవుటయ్యాడు. ఆల్‌రౌండర్ జేమ్స్ నీషమ్ 26 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.
Read Also: ప్రెగ్నెన్సీ సమయంలో ఈ ఆహారాన్ని తప్పకుండా తీసుకోవాలి..
ఆస్ట్రేలియా బౌలర్లలో హేజిల్‌వుడ్ రెండు వికెట్లు తీయగా.. స్పిన్నర్ జంపా ఓ వికెట్ పడగొట్టాడు. బ్యాటింగ్‌కు అనుకూలించే ఈ వికెట్‌పై ఈ లక్ష్యం పెద్దదేం కాదు. ఆస్ట్రేలియా ఈ లక్ష్యాన్ని ఛేదిస్తుందో.. చతికిలపడుతుందో వేచి చూడాలి. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా బౌలర్లందరూ భారీగా పరుగులు సమర్పించుకున్నారు. స్టార్క్ 36 పరుగులు, హేజిల్ వుడ్ 41 పరుగులు, ప్యాట్ కమిన్స్ 46 పరుగులు, స్టాయినీస్ 38 పరుగులు, ఆడమ్ జంపా 39 పరుగులు ఇచ్చారు.