ప్రెగ్నెన్సీ సమయంలో శిశువు ఎదుగుదలకు విటమిన్లు, ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్స్ ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి.
సరైన ఆహారాన్ని తీసుకోకుంటే శిశువు బరువుతో పాటు మానసిక ఎదుగుదలపై ప్రభావం చూపిస్తుంది.
పాల ఉత్పత్తులు
పాలు, చీజ్, పెరుగును తీసుకోవాలి. కాల్షియం, పాస్ఫరస్, మెగ్నీషియం, జింక్, విటమిన్ B ఉంటాయి.
చిక్కుళ్లు
ఐరన్, ఫోలెట్, ఫైబర్, ప్రొటీన్లు ఉంటాయి.
స్వీట్ పొటాటో
విటమిన్ ఏ, బీటా కెరోటిన్ ఉంటాయి. శిశువు ఎదుగుదలకు తోడ్పడుతుంది.
ఓమెగా -3 ఫ్యాటీ యాసిడ్స్.
శిశువు మెదడు, కళ్లు పరిణామానికి తోడ్పడుతుంది. సాల్మాన్ చేపల్లో ఫ్యాటీ-3 యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి.
విటమిన్ C
ఎక్కువగా స్ట్రాబెరీ, బ్రాకోలి, ఆరెంజ్ తీసుకోవడం వల్ల శిశు ఎదుగుదల బాగుంటుంది. ఐరన్ శోషణకు తోడ్పడుతుంది.
ఐరన్ రిచ్ ఫుడ్
పాలకూర, ఆకు కూరలు, పప్పులు, మాంసం, పచ్చని కూరగాయల్లో ఐరన్ ఎక్కువ. తల్లి, శిశువులో రక్తహీనతను అరికడుతుంది.
తృణధాన్యాలు..
జొన్నలు, సజ్జలు, రాగులు, ఓట్స్, క్వినోవా వంటివి ఎక్కువగా తీసుకోవాలి. విటమిన్లు, ప్రొటీన్లను అందిస్తాయి.