NTV Telugu Site icon

T20 World Cup: సెమీస్‌కు వెళ్లిన తొలి జట్టుగా న్యూజిలాండ్

New Zealand

New Zealand

T20 World Cup: టీ20 ప్రపంచకప్‌లో ఎట్టకేలకు సెమీస్ బెర్తులు ఖరారవుతున్నాయి. ఈ టోర్నీలోనే సెమీస్‌కు వెళ్లిన తొలి జట్టుగా న్యూజిలాండ్ నిలిచింది. శుక్రవారం నాడు గ్రూప్-1లో ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్ 35 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో న్యూజిలాండ్ ఖాతాలో 7 పాయింట్లు చేరాయి. ఇందులో మూడు విజయాలు, ఒక ఓటమి, ఒక మ్యాచ్ రద్దు ఉన్నాయి. 2.113 మెరుగైన రన్ రేట్ కారణంగా న్యూజిలాండ్‌కు సెమీస్ బెర్తు ఖరారైంది. రెండో సెమీస్ బెర్త్ ఆస్ట్రేలియా లేదా ఇంగ్లండ్‌కు దక్కనుంది. ప్రస్తుతం ఆ రెండు జట్ల ఖాతాలో చెరో 5 పాయింట్లు ఉన్నాయి. ఆస్ట్రేలియా జట్టు ఆశలన్నీ ఇంగ్లండ్-శ్రీలంక మ్యాచ్‌పైనే ఉన్నాయి. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌పై శ్రీలంక గెలిస్తే ఆసీస్‌కు సెమీస్ బెర్త్ ఖరారవుతుంది.

Read Also: Twitter: చిక్కుల్లో ఎలాన్ మస్క్.. కోర్టులో పిటిషన్.. కారణం ఇదే..

అలా కాకుండా ఇంగ్లండ్ విజయం సాధిస్తే మాత్రం మెరుగైన రన్‌రేట్ కారణంగా ఆ టీమ్ సెమీస్‌లోకి అడుగుపెడుతుంది. ఈ క్రమంలోనే శనివారం జరిగే మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ను శ్రీలంక ఓడించాలని ఆస్ట్రేలియా అభిమానులు కోరుకుంటున్నారు. ఆప్ఘనిస్థాన్‌తో మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 100 పరుగులతో విజయం సాధిస్తే ఇంగ్లండ్ 47 పరుగులతో గెలవాల్సి ఉంటుంది. ఆస్ట్రేలియా 80 పరుగులతో గెలిస్తే ఇంగ్లండ్ 29 పరుగులతో గెలవాలి. అదే ఆస్ట్రేలియా 50 పరుగులతో గెలిస్తే ఇంగ్లండ్ ఒక్క పరుగుతో గెలిచినా సరిపోతుంది. మరోవైపు గ్రూప్-2లో భారత్, దక్షిణాఫ్రికాకు సెమీస్‌కు చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే సెమీస్ రేసులో పాకిస్థాన్, బంగ్లాదేశ్ కూడా ఉన్నాయి. జింబాబ్వేపై భారత్, నెదర్లాండ్స్‌పై దక్షిణాఫ్రికా గెలిస్తే నేరుగా సెమీస్‌లోకి అడుగుపెడతాయి.

Show comments