Site icon NTV Telugu

Virat Kohli Row: కోహ్లీని మళ్లీ రెచ్చిగొట్టిన నవీన్.. గంభీర్ కూడా!

Naveen Virat Kohli

Naveen Virat Kohli

Naveen Ul Haq Savage Aim At Virat Kohli In Cryptic Post: మే 1వ తేదీన లక్నో సూపర్ జెయింట్స్‌, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య మ్యాచ్ ముగిసిన తర్వాత.. కోహ్లీ, నవీన్ ఉల్ హక్, గంభీర్‌ల మధ్య పెద్ద గొడవ జరిగిన విషయం అందరికీ తెలిసిందే! తొలుత ఫీల్డ్‌లో ఉన్నప్పుడే కోహ్లీ, నవీన్ మధ్య వాడీవేడీ వాతావరణం నెలకొంది. మ్యాచ్ ముగిశాక కరచాలనం చేస్తున్నప్పుడు.. నవీన్, కోహ్లీ మధ్య వాగ్వాదం జరిగింది. అనంతరం కైల్ మేయర్స్‌తో కోహ్లీ మాట్లాడుతుండగా.. గంభీర్ జోక్యం చేసుకోవడంతో, ఆ గొడవ మరింత తీవ్రమైంది. కోహ్లీ, గంభీర్ మధ్య మాటమాట పెరిగి.. ఇరువురిపై 100% ఫైన్ వేసేదాకా వ్యవహారం వెళ్లింది.

Naga Chaitanya: ఆ డైరెక్టర్ కు ఉన్న కొంచెం పరువును కూడా తీసేసిన చైతన్య

సాధారణంగా.. ప్లేయర్స్ ఇలా ఫీల్డ్‌లో గొడవ పడిన తర్వాత, ఆ వెంటనే తమ మధ్య విభేదాల్ని పరిష్కరించుకుంటారు. ఆరోజే కాకపోయినా.. మెల్లమెల్లగా పరిస్థితులు సద్దుమణిగేలా చూసుకుంటారు. కానీ.. ఇక్కడ కోహ్లీ, గంభీర్, నవీన్ మధ్య జరిగిన గొడవ మాత్రం ఇప్పుడప్పుడే సద్దుమణిగేలా లేదు. రోజురోజుకి ఇది ఇంకా ముదురుతున్నట్టే కనిపిస్తోంది. నేరుగా కాకపోయినా.. సోషల్ మీడియా మాధ్యమంగా పరోక్ష వ్యాఖ్యలైతే చేసుకుంటున్నారు. మొదట్లో ఇన్‌స్టాలో కోహ్లీ, నవీన్ పరస్పర పోస్టులు పెట్టారు. ఇప్పుడు మరోసారి కోహ్లీని రెచ్చగొట్టేలా నవీన్ మరో పోస్ట్ ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టాడు. గంభీర్‌తో కలిసి దిగిన ఫోటోను షేర్ చేస్తూ.. ‘‘మీతో ఇతరులు ఎలా వ్యవహరించాలని కోరుకుంటారో, మీరు కూడా వారితో అలాగే వ్యవహరించండి.. మీతో ఇతరులు ఎలా మాట్లాడాలని అనుకుంటారో, మీరు కూడా వారితో అలాగే మాట్లాడండి’’ అంటూ నవీన్ రాసుకొచ్చాడు.

Rohit Sharma: ‘రోహిత్’ కాదు.. ‘నోహిట్’ శర్మగా పేరు మార్చుకో..

ఈ పోస్ట్ చూసిన గంభీర్.. నవీన్‌కి వత్తాసు పలుకుతూ, ఆ పోస్ట్ కింద ఒక కామెంట్ చేశాడు. ‘‘నువ్వు ఎలా ఉంటావో అలాగే ఉండు, నిన్ను నువ్వు ఎప్పుడూ మార్చుకోకు’’ అంటూ పరోక్షంగా కోహ్లీకి చురకలంటించేలా నవీన్‌కి మద్దతు పలికాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. దీనిపై కోహ్లీ ఇంతవరకూ స్పందించలేదు కానీ, కోహ్లీ ఫ్యాన్స్ మాత్రం తీవ్రంగా మండిపడుతున్నారు. ఓటమిని జీర్ణించుకోలేకే.. వీళ్లిద్దరు ఇలా కోహ్లీపై తమ అక్కసు వెళ్లగక్కుతున్నారంటూ విమర్శిస్తున్నారు. ఈ వ్యవహారం ఇంకా ఎన్నాళ్లవరకు కొనసాగుతుందో చూడాలి.

Exit mobile version