MS Dhoni: ధోనీ బ్యాట్ కొరకడం వెనుక అసలు కారణమిది!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
క్రికెట్ ప్రియులు, ముఖ్యంగా ధోనీ అభిమానులు.. క్రీజులోకి వెళ్ళడానికి ముందు ధోనీ బ్యాట్ కొరకడాన్ని చాలా సందర్భాల్లో గమనించే ఉంటారు. అంతెందుకు.. ఆదివారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో ధోనీ బ్యాటింగ్‌కి రావడానికి ముందు తన బ్యాట్ కొరుకుతూ కెమెరాకి చిక్కాడు. ఇప్పుడు ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అసలెందుకు ధోనీ ఇలా చేస్తాడని గతంలో చాలామంది సందేహాలు వ్యక్తం చేసినా, సమాధానం దొరకలేదు.
అయితే, ఇన్నాళ్ళ తర్వాత మాజీ క్రికెటర్ అమిత్ మిశ్రా రూపంలో ఆ సమాధానం దొరికింది. ‘‘క్రీజులోకి వెళ్ళడానికి ముందు ధోనీ తన బ్యాట్‌ని ఎందుకు కొరుకుతాడని మీరు ఆలోచిస్తున్నారా? తన బ్యాట్‌పై ఏదైనా టేప్ ఉండే అవకాశం ఉంటుందన్న అనుమానంతో, దానిని తొలగించడానికే ధోనీ నోటితో కొరుకుతుంటాడు. ప్రతీసారి బ్యాటింగ్‌కు వెళ్లడానికి ముందు బ్యాట్‌పై ఎలాంటి టేప్ లేదా థ్రెడ్ ఉండకూడదని ధోని అనుకుంటాడు. కావాలంటే, మీరెప్పుడైనా ధోనీ బ్యాట్‌ను గమనించండి.. ఎలాంటి టేప్, థ్రెడ్ కనిపించవు’’ అంటూ ట్విటర్ మాధ్యమంగా అమిత్ మిశ్రా చెప్పుకొచ్చాడు. అదన్నమాట సంగతి!
Also Read
- IND vs ENG 2nd ODI: సిరీస్ చేజిక్కించుకోవాలంటే బౌలర్ల చేతుల్లోనే.. ఇంగ్లాండ్ లక్ష్యం ఎంతంటే..
- Rohit Sharma: చేసిన పరుగులు 26.. అయినా అరుదైన రికార్డ్ సాధించిన రోహిత్ శర్మ..
- Virat Kohli-Rohit: విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ అరుదైన రికార్డు.. చరిత్రలో నిలిచిపోయేలా..
- MLC 2026: టీ20 క్రికెట్ చరిత్రలో సరికొత్త రికార్డు.. తొలిసారి ఒకే మ్యాచ్‌లో 50+ సిక్సర్లు..
కాగా.. ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో సీఎస్కే భారీ విజయం సొంతం చేసుకుంది. ఇందులో ధోనీ మరోసారి ఫినిషర్‌గా రాణించాడు. ధనాధన్ ధోనీ ఇన్నింగ్స్‌తో సీఎస్కే 200 పరుగులు దాటింది. ఆ తర్వాత లక్ష్య చేధనలో ఘోరంగా విఫలమైన ఢిల్లీ, 117 పరుగులకే కుప్పకూలింది. అయినప్పటికీ, సీఎస్కేకి ప్లేఆఫ్ అవకాశాలు దాదాపు లేనట్లే. 11 మ్యాచ్‌ల్లో నాలుగు మాత్రమే గెలిచిన ఆ జట్టు, పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానంలో ఉంది.
తాజావార్తలు
-
Bank Loan: ఎలాంటి పూచీ కత్తు లేకుండా రూ.20 లక్షల లోన్ .. ప్రాసెస్ ఇదే..
-
MG Motors: MG నుంచి కొత్త ADAPT టెక్నాలజీ.. EVలు, హైబ్రిడ్ కార్ల తయారీలో సంచలనం..
-
Kejriwal: సోనం వాంగ్చుక్కు కేజ్రీవాల్ మద్దతు.. యువత డిమాండ్లు నెరవేర్చాలని డిమాండ్
-
IND vs ENG 2nd ODI: సిరీస్ చేజిక్కించుకోవాలంటే బౌలర్ల చేతుల్లోనే.. ఇంగ్లాండ్ లక్ష్యం ఎంతంటే..
-
The Odyssey: ‘ది ఒడిస్సీ’ ప్రీ రివ్యూ ..
ట్రెండింగ్
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్‌లో లాంచ్..!
-
144Hz డిస్‌ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్‌లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!