Site icon NTV Telugu

IPL 2022 : టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న ముంబై

Mi Vs Rr

Mi Vs Rr

నేడు ఐపీఎల్‌-2022లో డీవై పాటిల్ స్టేడియం వేదికగా రాజస్థాన్ రాయల్స్‌తో ముంబై ఇండియన్స్‌ తలపడుతోంది. ఈ సీజన్‌లో రాజస్తాన్‌ అద్భుతం‍గా రాణిస్తుండగా.. ముంబై ఇండియన్స్‌ వరుస ఓటములతో పాయింట్ల పట్టికలో అఖరి స్థానంలో నిలిచింది. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు 8 మ్యాచ్‌లు ఆడిన ముంబై అన్నింట్లోనూ ఓటమి చెందింది. అయితే ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన ముంబై బౌలింగ్‌ ఎంచుకుంది. పాయింట్ల పట్టికలో రాజస్తాన్ రాయల్స్ రెండో స్థానంలో ఉండగా… ముంబై ఇండియన్స్ చివరి స్థానంలో ఉంది. ఈ మ్యాచ్‌లో అయినా విజయం సాధించి పరువు కాపాడుకోవాలని ముంబై చూస్తోంది.

రాజస్తాన్ రాయల్స్ ఆడిన ఎనిమిది మ్యాచ్‌ల్లో ఆరు విజయాలు సాధించి మంచి జోరు మీదుంది. జోస్ బట్లర్ అత్యధిక పరుగులతో ఆరెంజ్ క్యాప్ హోల్డర్‌గా ఉండగా… యుజ్వేంద్ర చాహల్ అత్యధిక వికెట్లతో పర్పుల్ క్యాప్ దక్కించుకున్నాడు. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ అన్ని విభాగాల్లోనూ జోరు చూపిస్తూ టైటిల్ వేటలో దూసుకుపోతుంది.

Exit mobile version