Mumbai Indians Won The Toss And Chose To Field: ఐపీఎల్ 2023 సీజన్‌లో భాగంగా మంగళవారం ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్ జట్లు తలపడుతున్నాయి. గుజరాత్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో ముంబై జట్టు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంపిక చేసుకుంది. దీంతో.. గుజరాత్ టైటాన్స్ బ్యాటింగ్ చేసేందుకు రంగంలోకి దిగింది. ఈ సీజన్‌లో ఆల్రెడీ ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ జరగ్గా.. అందులో ముంబై ఇండియన్స్ 5 పరుగుల తేడాతో గెలుపొందింది. ఇప్పుడు మరోసారి ఈ ఇరుజట్ల మధ్య హోరాహోరీ పోరు సాగుతున్న తరుణంలో.. ఎవరు గెలుస్తారన్నది అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Dubai Sand Plot: రికార్డ్ ధరకి ఇసుక ప్లాట్.. ఓనర్‌కి 242% లాభం
ఈ సీజన్‌లో మొదట్లో రెండు మ్యాచ్‌లు ఓడిన ముంబై జట్టు.. ఆ తర్వాత హ్యాట్రిక్ విజయాలు నమోదు చేసింది. కానీ.. ఆరో మ్యాచ్ మాత్రం పంజాబ్ చేతిలో ఓడిపోయింది. ప్రస్తుతం ఆరు పాయింట్లతో ఉన్న రోహిత్ సేన.. టాప్-4లో స్థానం సంపాదించాలని పట్టుదలతో ఉంది. అందుకే.. గుజరాత్‌ని ఓడించి, ముందుకు దూసుకెళ్లాలని కసిగా ఉంది. బ్యాటింగ్ పరంగా ముంబై జట్టు పటిష్టంగానే ఉంది. రోహిత్ శర్మ, కెమెరాన్ గ్రీన్, టిమ్ డేవిడ్, సూర్య కుమార్ యాదవ్, తిలక్ వర్మ.. బాగానే రాణిస్తున్నారు. సూర్యకుమార్ మొదట్లో ఫెయిల్ అయినా.. ఆ తర్వాత ఫామ్‌లోకి తిరిగొచ్చాడు. కాకపోతే.. బౌలింగే ముంబైకి మైనస్‌గా మారింది. కానీ.. గుజరాత్ జట్టుకి బౌలింగే ప్రధాన అస్త్రం. చిన్న స్కోర్లను కూడా డిఫెండ్ చేయగలుగుతున్నారంటే.. ఏ స్థాయిలో గుజరాత్‌లో బౌలర్లు రాణిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు.
David Warner: డేవిడ్ వార్నర్‌కి ఊహించని షాక్.. మళ్లీ రిపీటైతే నిషేధమే!
అలాగని బ్యాటింగ్‌లో పేలవంగా ఉందని కాదు. బ్యాటర్లు కూడా వీలు చిక్కినప్పుడల్లా మెరుగైన ప్రదర్శన కనబరుస్తున్నారు. వృద్ధిమాన్ ఓపెనింగ్‌లో అప్పుడప్పుడు మెరుపులు మెరిపిస్తుంటే, శుభ్మన్ నిలకడగా ఆడుతున్నాడు. సాయి సుదర్శన్ అవకాశం వచ్చినప్పుడల్లా రెచ్చిపోతున్నాడు. ఇతర బ్యాటర్లు సైతం ఆయా సందర్భాల్లో తమతమ సత్తా చాటుతూనే ఉన్నారు. కానీ.. ముంబై లాంటి జట్టుపై గెలుపొందాలంటే మాత్రం, అన్ని విభాగాల్లోనూ గుజరాత్ జట్టు మెరుగ్గా రాణించాల్సి ఉంటుంది. మంచి బౌలర్లు ఉన్నా.. తక్కువ స్కోరుతో చాపచుట్టేస్తే మాత్రం, ముంబై చేతికి విజయాన్ని కట్టబెట్టినట్టు అవుతుంది. మరి.. ఈ మ్యాచ్‌లో ఎవరు పైచేయి సాధిస్తారో చూడాలి.
