NTV Telugu Site icon

IPL 2023: ఏకంగా 13 మంది ఆటగాళ్లను వదులుకున్న ముంబై ఇండియన్స్

Mumbai Indians

Mumbai Indians

IPL 2023: ఈ ఏడాది ఐపీఎల్ సీజన్‌లో దారుణంగా విఫలమైన ముంబై ఇండియన్స్ వచ్చే ఏడాది జరిగే మెగా లీగ్ కోసం భారీ మార్పులకు శ్రీకారం చుట్టింది. ఈ నేపథ్యంలో రిటెన్షన్ ప్రక్రియలో భాగంగా ఏకంగా 13 మంది ఆటగాళ్లను ముంబై యాజమాన్యం వదులుకుంది. దీంతో ముంబై పర్స్‌లో రూ.20.5 కోట్లు మిగిలాయి. ఈ డబ్బుతో వచ్చే నెల 20న జరిగే మినీ వేలంలో సత్తా కలిగిన ఆటగాళ్ల కొనుగోలు చేసి వచ్చే సీజన్‌లో మరోసారి టైటిల్ సాధించాలని భావిస్తోంది. ముంబై ఫ్రాంచైజీ వదులుకున్న ఆటగాళ్ల జాబితాలో కీరన్ పొలార్డ్, అన్మోల్‌ప్రీత్ సింగ్, ఆర్యన్ జుయల్, బసిల్ తంపి, డానియల్ సామ్స్, అల్లెన్, జయదేవ్ ఉనద్కత్, మార్కండే, మురుగన్ అశ్విన్, రాహుల్ బుద్ది, సంజయ్ యాదవ్, మెరిడిత్, సంజయ్ యాదవ్, టైమల్ మిల్స్ ఉన్నారు.

Read Also: Rescue operation For Eagle: గద్ద కోసం 2 గంటల రెస్క్యూ ఆపరేషన్.. అసలేం జరిగింది..?

ముంబై ఇండియన్స్ రిటైన్ చేసుకున్న ఆటగాళ్ల జాబితాలో కెప్టెన్ రోహిత్ శర్మ, టిమ్ డేవిడ్, రమణ్‌దీప్ సింగ్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, స్టబ్స్, బ్రేవిస్, జోఫ్రా ఆర్చర్, బుమ్రా, అర్జున్ టెండూల్కర్, అర్షద్ ఖాన్, కార్తికేయ, ఆకాష్ మద్వాల్, హృతిక్ షోకిన్ ఉన్నారు. ముంబై జట్టులో ప్రస్తుతానికి మూడు ఓవర్‌సీస్ స్లాట్స్ ఖాళీగా ఉన్నాయి. గతేడాది ఆర్‌సీబీకి ఇచ్చిన జాసన్ బెహండార్ఫ్‌ను ముంబై జట్టు మళ్లీ ట్రేడ్ చేసుకుంది. కాగా 15 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా పాయింట్ల పట్టికలో ఈ ఏడాది ముంబై ఇండియన్స్ అట్టడుగున నిలిచి దారుణ విమర్శలకు గురైంది.