ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 సీజన్ 16లో భాగంగా ప్లేఆఫ్స్ లో నేడు లక్నో సూపర్ జెయింట్స్-ముంబై ఇండియన్స్ మధ్య ఎలిమినేటర్ మ్యాచ్ కు రంగం సిద్ధమైంది. చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా జరుగుతున్న.. ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టే అహ్మదాబాద్ లో క్వాలిఫయర్-2లో గుజరాత్ టైటాన్స్ తో తలపడుతుంది. ఓడిన టీమ్ ఇంటికి వెళ్లాపోవాల్సిందే. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన రోహిత్ శర్మ బ్యాటింగ్ తీసుకున్నాడు. ఇక లక్నో ఫస్ట్ బౌలింగ్ చేయనుంది.
Also Read : Vaibhavi Upadhyay: కారు యాక్సిడెంట్ లో సీరియల్ నటి మృతి
ఈ సీజన్ లో 14 మ్యాచ్ లు ఆడి ఎనిమిదింటిలో గెలిచిన లక్నో 17 పాయింట్లతో ప్లేఆఫ్స్ లో మూడో స్థానంలో నిలిచింది. ముంబై.. 14 మ్యాచ్ ల్లో 8 గెలిచి 16 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉంది. ఈ రెండు జట్ల మధ్య హోరాహోరిగా జరుగనుంది. లక్నో సూపర్ జెయింట్స్ పై రోహిత్ సేనకు చెత్త రికార్డు ఉంది. ఐపీఎల్ లో గత సీజన్ లో ఎంట్రీ ఇచ్చిన లక్నో.. ఇప్పటివరకూ 3 సార్లు ముంబైతో తలపడింది. కాగా.. ఆడిన మూడుసార్లూ రోహిత్ సేనకు ఓటమి తప్పలేదు. ఈ సీజన్ లో కూడా లక్నో – ముంబై మ్యాచ్ లో కృనాల్ సేనదే విజయం. మరి నేటి కీలక మ్యాచ్ లో లక్నో గండాన్ని ముంబై ఏ మేరకు అధిగమిస్తుందనేది వేచి చూడాలి..
Also Read : Andhra Pradesh: సీఎం జగన్‌తో జర్మనీ కాన్సుల్ జనరల్ భేటీ.. పెట్టుబడులకు ఏపీ ఫోకస్డ్ స్టేట్..!
ఇక బలాబలాల విషయంలో ఇరు జట్లూ సమఉజ్జీలే. బ్యాటింగ్ లో ముంబైకి ఇషాన్, రోహిత్, సూర్య, కామెరూన్ గ్రీన్, టిమ్ డేవిడ్, నెహల్ వధేర, తిలక్ వర్మ వంటి స్టార్ట్ ప్లేయర్లు ఉన్నారు. లక్నోలో టీమ్ లో క్వింటన్ డికాక్, కైల్ మేయర్స్, ప్రేరక్ మన్కడ్, మార్కస్ స్టోయినిస్, నికోలస్ పూరన్, అయుష్ బధోని తో పాటు కెప్టెన్ కృనాల్ కూడా అద్భుతమైన బ్యాటింగ్ చేయగలడు. అయితే బౌలింగ్ విషయంలో మాత్రం ముంబై కంటే లక్నో పటిష్టంగా కనిపిస్తుంది. ముంబై బౌలర్లలో ఆకాశ్ మధ్వాల్ ఒక్కడే పేసర్ల విభాగంలో బాగా రాణిస్తున్నాడు. అనుభవజ్ఞుడైన స్పిన్నర్ పియూష్ చావ్లా ఉండటం ముంబైకి కలిసొచ్చేదే. కాగా లక్నోకు మోహ్సిన్ ఖాన్, రవి బిష్ణోయ్, మార్కస్ స్టోయినిస్ తో పాటు కృనాల్ పాండ్యా, యశ్ ఠాకూర్ రూపంలో మంచి బౌలింగ్ ఉంది.
