Mumbai Indians Need To Score 234 To Win The Match Against GT: అహ్మదాబాద్‌లో నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ వీరవిహారం చేసింది. ముంబై బౌలర్లపై తాండవం చేసి, మైదానంలో పరుగుల ప్రళయం సృష్టించింది. నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి ఏకంగా 233 పరుగులు చేసింది. శుబ్మన్ గిల్ (60 బంతుల్లో 129) సెంచరీతో చెలరేగడం.. సుదర్శన్ (31 బంతుల్లో 43), హార్దిక్ పాండ్యా (13 బంతుల్లో 28) మెరుపు ఇన్నింగ్స్ ఆడటంతో.. గుజరాత్ ఇంత భారీ స్కోరు చేయగలిగింది. ఈ మ్యాచ్ గెలుపొందాలంటే.. ముంబై ఇండియన్స్‌కు 234 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేధించాల్సి ఉంటుంది. మరి, ముంబైకి ఇది సాధ్యమవుతుందా?
Imran Khan: “కొకైన్” వాడిన ఇమ్రాన్ ఖాన్.. మెడికల్ రిపోర్టుల్లో తేలిందన్న పాక్ మంత్రి..
తొలుత టాస్ ఓడి బ్యాటింగ్‌కి దిగిన గుజరాత్ జట్టు.. నిదానంగానే తమ ఇన్నింగ్స్ ప్రారంభించింది. ఓపెనర్లు క్రీజులో కుదురుకోవడం కోసం కొంత సమయం తీసుకున్నారు. కానీ.. క్రీజులో కుదురుకున్న తమ బ్యాట్‌కి పనిచెప్పడం మొదలుపెట్టారు. ముఖ్యంగా.. శుబ్మన్ గిల్ అయితే ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఎలాంటి బంతులు వేసినా సరే, వాటిని తనకు అనుకూలంగా మార్చుకొని బౌండరీల మీద బౌండరీలు బాదేశాడు. సాహా (18) ఔటైనా.. గిల్ మాత్రం తన దూకుడు తగ్గించుకోలేదు. ఇక అర్థశతకం పూర్తి చేసుకున్నాక అతడు మరింత చెలరేగిపోయాడు. ప్రతీ బంతిని బౌండరీగా మార్చడమే పనిగా పెట్టుకున్నాడు. అతడ్ని ఔట్ చేసేందుకు ముంబౌ బైలర్లు క్లిష్టమైన బంతులు వేసినా ప్రయోజనం లేకుండా పోయింది. అప్పటికే ముంబై బౌలర్ల స్వభావాన్ని అర్థం చేసుకోగలిగిన గిల్.. వారికి తగ్గట్టుగానే తన ఆటతీరుని మార్చుకొని, మైదానంలో పరుగుల సునామీ సృష్టించాడు. 7 ఫోర్లు, 10 సిక్సులు కొట్టాడంటే.. ఏ రేంజ్‌లో అతడు విజృంభించాడో మీరే అర్థం చేసుకోండి. సెంచరీ వద్ద కొంచెం నెమ్మదించాడు కానీ, ఆ తర్వాత మళ్లీ అదే దూకుడు కొనసాగించాడు. కానీ, ఆ దూకుడులోనే అతడు 129 వ్యక్తిగత పరుగుల వద్ద క్యాచ్ ఔట్ అయ్యాడు.
Cheapest Countries: ప్రపంచంలో బ్రతకడానికి టాప్-10 చౌకైన దేశాలు
నిజానికి.. ఆరో ఓవర్‌లోనే జోర్డాన్ బౌలింగ్‌లో శుబ్మన్ ఔట్ అవ్వాల్సింది. కానీ.. అప్పుడు టిమ్ డేవిడ్ క్యాచ్ వదిలేశాడు. అదే టిమ్ డేవిడ్ మరోసారి అవకాశం వచ్చినప్పుడు మాత్రం క్యాచ్ విడిచిపెట్టలేదు. అటు.. సాహా ఔటయ్యాక వచ్చిన సాయి సుదర్శన్ కూడా కొన్ని మెరుపులు మెరిపించాడు. నిదానంగా ఆడినా.. ఆ తర్వాత పుంజుకున్నాడు. ఇక చివర్లో గిల్ పోయాక వచ్చిన హార్దిక్ పాండ్యా కూడా ముంబై బౌలర్లపై మెరుపుదాడి చేశాడు. 13 బంతుల్లోనే 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 28 పరుగులు చేశాడు. ఇలా.. అందరూ చెలరేగి ఆడటంతో.. గుజరాత్ జట్టు 233 పరుగులు చేయగలిగింది. ముంబై జట్టులో కూడా విధ్వంసకర బ్యాటర్లు ఉన్నారు కానీ.. లక్ష్యం మాత్రం చాలా పెద్దది. మరి, ముంబై జట్టు ఎలా రాణిస్తుందో చూడాలి.