IPL 2022: ఐపీఎల్ చరిత్రలోనే రోహిత్ శర్మ చెత్త రికార్డు

Rohit Sharma

Rohit Sharma

గురువారం రాత్రి చెన్నై సూపర్‌కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ తొలి ఓవర్లోనే డకౌట్ అయ్యాడు. దీంతో ఐపీఎల్ చరిత్రలోనే రోహిత్ శర్మ చెత్త రికార్డు నెలకొల్పాడు. ఓవరాల్ ఐపీఎల్‌లో అత్యధిక సార్లు డకౌట్ అయిన ఆటగాడిగా నిలిచాడు. ఇప్పటివరకు ఐపీఎల్‌లో మొత్తం 14 సార్లు రోహిత్ డకౌట్ అయ్యాడు. రోహిత్ తర్వాత అత్యధికంగా 13 సార్లు డకౌట్ అయిన ఆటగాళ్లలో పీయూష్ చావ్లా, హర్భజన్, మన్‌దీప్ సింగ్, పార్థివ్ పటేల్, రహానే, అంబటి రాయుడు ఉన్నారు.

కాగా ఈ సీజన్‌ ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ వరుసగా ఏడో పరాజయాన్ని నమోదు చేసింది. దీంతో దాదాపుగా ప్లే ఆఫ్స్ అవకాశాలను ముంబై జట్టు దూరం చేసుకుంది. ఈ ఏడాది అటు కెప్టెన్‌గా, ఇటు ఆటగాడిగా రోహిత్ దారుణ వైఫల్యాలను చవిచూస్తున్నాడు. గతంలో ఐదు టైటిల్స్ అందించిన కెప్టెన్ ఇతడేనా అంటూ విమర్శలను ఎదుర్కొంటున్నాడు. ఈ సీజన్‌లో రోహిత్ ఆడిన ఏడు మ్యాచ్‌లలో కేవలం 114 పరుగులు మాత్రమే చేశాడు. ఈ ఏడాది ఐపీఎల్‌లో రోహిత్ స్కోర్లు: 41, 10, 3, 26, 8, 6, 0

IPL 2022 : ఉత్కంఠ నడుమ విజయం సాధించిన సీఎస్‌కే.. ధోని సూపర్‌ ఇన్నింగ్స్‌..