Site icon NTV Telugu

IPL 2023 : సన్ రైజర్స్ పై ముంబై ఇండియన్స్ ఘన విజయం

Mumbai

Mumbai

ఐపీఎల్‌ 16వ సీజన్‌లో ముంబై ఇండియన్స్‌ స్టార్‌ ఆల్‌రౌండర్‌ కామెరాన్‌ గ్రీన్‌ సెంచరీతో అదరగొట్టాడు. సన్ రైజర్స్ హైదరాబాద్ తో తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో కామెరూన్ గ్రీన్‌ సెంచరీతో కదం తొక్కి మ్యాచ్‌ గెలిపించడంతో పాటు తొలి ఐపీఎల్‌ సెంచరీని కూడా తన అకౌంట్ లో వేసుకున్నాడు. 47 బంతుల్లో సెంచరీ మార్క్‌ అందుకున్న కామెరాన్‌ గ్రీన్‌ ఇన్నింగ్స్‌లో 8 ఫోర్లు, 8 సిక్సర్లు ఉన్నాయి. కాగా ఎస్‌ఆర్‌హెచ్‌పై విజయంతో ముంబై ఇండియన్స్‌ 16 పాయింట్లతో ప్లేఆఫ్‌ రేసులో ఉన్నప్పటికి.. ముంబై స్ట్రైక్ రేట్ మాత్రం -0.13తో ఉంది. అయితే ఆర్‌సీబీ, గుజరాత్‌ టైటాన్స్‌ మ్యాచ్‌ ఫలితంపై ఆధారపడాల్సి ఉంది. ఒకవేళ వర్షంతో మ్యాచ్‌ రద్దు అయితే ముంబై ప్లేఆఫ్‌కు చేరుకుంటుంది.

Also Read : Takkar Trailer: బొమ్మరిల్లు సిద్దార్థ్ ‘టక్కర్’ పనులు

అంతకు ముందు.. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ ఇన్నింగ్స్ ముగిసింది. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసింది. సన్ రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్లు మయాంక్ అగర్వాల్ (46 బంతుల్లో 83, 8 ఫోర్లు, 4 సిక్సర్లు), తొలి ఐపీఎల్ మ్యాచ్ ఆడుతున్న వివ్రాంత్ శర్మ (47 బంతుల్లో 69, 9 ఫోర్లు, 2 సిక్సర్లు) దంచికొట్టడంతో ఎస్ ఆర్ హెచ్ భారీ స్కోరు చేసింది. ఈ ఇ్దదరూ తొలి వికెట్‌కు 140 పరుగులు జోడించారు. ఇన్నింగ్స్ చివర్లో హైదరాబాద్ బ్యాటర్లు తడబడ్డడంతో నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్లు నష్టపోయి 200 పరుగులు చేసింది.

Also Read : IPL 2023 : ఆర్సీబీతో గుజరాత్ ఢీ.. వర్షం దెబ్బకి టాస్ ఆలస్యం..

ఈ సీజన్‌లో ముంబై ఇండియన్స్‌ తరపున కామెరాన్‌ గ్రీన్‌ కిది రెండో సెంచరీ కాగా తొలి సెంచరీ సూర్యకుమార్‌ యాదవ్‌ చేశాడు. ఇక ఐపీఎల్‌ 2023లో గ్రీన్‌ది తొమ్మిదో సెంచరీ.. ఇంతకముందు హెన్రిచ్ క్లాసెన్ (104 పరుగులు ), విరాట్ కోహ్లీ 100 పరుగులు,శుభమాన్ గిల్ (101 పరుగులు), ప్రభసిమ్రాన్ సింగ్ (103 పరుగులు), సూర్యకుమార్ యాదవ్ (103 పరుగులు నాటౌట్) , యశస్వి జైస్వాల్ (124 పరుగులు) , వెంకటేష్ అయ్యర్ (104 పరుగులు) , హ్యారీ బ్రూక్ (100 పరుగులు నాటౌట్)తో ఉన్నారు.

Exit mobile version