పూణేలోని ఎంసీఏ స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ జట్లు తలపడనున్నాయి. ఐపీఎల్ సీజన్ 2022లో ఆడిన 4 మ్యాచ్‌ల్లో ఓడి, పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ముంబై ఇండియన్స్ ఉంది. అయితే ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్‌లోనైనా గెలిచి విజయం పతాకం ఎగురవేయాలని ముంబై ఇండియన్స్ జట్టు ఉవ్విల్లురుతోంది. ఈ నేపథ్యంలో టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ బౌలింగ్ ఎంచుకుంది. అయితే ముందుగా బ్యాటింగ్‌కు వచ్చిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 198 పరుగుల భారీ స్కోరు చేసింది. శిఖర్ ధావన్ 70 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. కెప్టెన్ మయాంక్ అగర్వాల్ 52 పరుగులు సాధించాడు. ఇక చివర్లో జితేశ్ శర్మ 14 బంతుల్లో 30 పరుగులతో మెరవడంతో పంజాబ్‌కు భారీ స్కోరు సాధించింది. ముంబై బౌలర్లలో బాసిల్ థంపి 2, బుమ్రా, ఉనాద్కట్, మురుగన్ అశ్విన్ తలా ఒక వికెట్ ఖాతాలో వేసుకున్నారు.
IPL 2022 : చెలరేగిన పంజాబ్ కింగ్స్.. ముంబై లక్ష్యం 199

Punjab Kings