Site icon NTV Telugu

వైరల్‌గా మారిన ధోనీ కొత్త లుక్‌

అంతర్జాతీయ క్రికెట్ నుండి తప్పుకున్న తర్వాత ఐపీఎల్ త‌ప్ప మ‌రో కాంపిటిటివ్ క్రికెట్‌లో ధోనీ ఆడ‌టం లేదు. అయితే కరీనా కారణంగా ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ వాయిదా పడిన విషయం తెలిసిందే. దాంతో ప్ర‌స్తుతం త‌న టైమంతా ఫ్యామిలీతోనే గ‌డుపుతున్నాడు. అయితే ధోనీ ఆడినా ఆడ‌క‌పోయినా ఏదో ఒక ర‌కంగా వార్త‌ల్లో నిలుస్తుంటాడు. ధోనీ కొత్త లుక్కే మ‌రోసారి వార్త‌ల్లో నిలిచేలా చేసింది. హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌లో లాక్‌డౌన్ ఎత్తేసిన త‌ర్వాత ఫ్యామిలీతో క‌లిసి షిమ్లా వెళ్లిన ధోనీ.. ఈ కొత్త లుక్‌లో క‌నిపించి ఆశ్చ‌ర్య‌ప‌రిచాడు. పెద్ద పెద్ద మీసాల‌తో అత‌డు పూర్తి డిఫ‌రెంట్‌గా క‌నిపిస్తున్నాడు.

Exit mobile version