టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మైదానంలోనే కాదు.. బయట కూడా చాలా కూల్‌గా ఉంటాడు. ఏమాత్రం గర్వం లేనివాడు ధోనీ. అంతేకాదు అందరితో చాలా సరదాగా గడుపుతాడు. అన్నింటిని ఇంచి మంచి మనసున్న మనిషి. ఇప్పటికే ఎన్నోసార్లు తన మంచి మనసు చాటుకున్న ధోనీ.. తాజాగా మరోసారి చాటుకున్నాడు. తన విల్లాలో పని చేసే సెక్యూరిటీ గార్డుకు మహీ సాయం చేశాడు. ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఐపీఎల్ 2023లో చెన్నై సూపర్ కింగ్స్‌కు ఎంఎస్ ధోనీ టైటిల్ అందించిన విషయం తెలిసిందే. మోకాలి గాయంతోనే 16వ సీజన్ ఆడిన ధోనీ.. లీగ్ ముగియగానే సర్జరీ చేయించుకున్నాడు. ప్రస్తుతం ఖాళీ సమయాన్ని కుటుంబంతో ఎంజాయ్ చేస్తున్నాడు. తన విల్లా, వ్యవసాయ క్షేత్రంలో ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ క్రమంలోనే తన విల్లాలో పని చేసే ఓ సెక్యూరిటీ గార్డుకు సాయం చేశాడు.
విల్లా గేటు వద్ద పని చేసే సెక్యూరిటీ గార్డు తన డ్యూటీ కోసం వస్తుండగా.. ఆయనను ఎంఎస్ ధోనీ చూశాడు. విల్లా నుంచి గేటు చాలా దూరం ఉండటంతో.. సెక్యూరిటీ గార్డును బైకుపై కూర్చోబెట్టుకొని గేటు వద్ద వదిలిపెట్టాడు. అదే సమయంలో విల్లా గేటు వద్ద మాజీ కెప్టెన్ ధోనీని చూసేందుకు ఎదురు చూస్తున్న అభిమానులు ఈ ఘటనను తమ మొబైలల్లో బంధించారు. సెక్యూరిటీ గార్డును దించాక మహీ వారికి హలో కూడా చెప్పాడు. దాంతో వారు సంబరపడిపోయారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. ‘ధోనీ మంచి మనసు’ అని ఫాన్స్ కామెంట్స్ పెడుతున్నారు.
Also Read: SL vs NZ: శ్రీలంక చారిత్రక విజయం.. తొలి సిరీస్ సొంతం!
Also Read: BAN vs IND: టీమిండియాకు ముగ్గురు ఆంధ్ర క్రికెటర్లు ఎంపిక.. క్రికెట్ చరిత్రలో ఇదే తొలిసారి!
Dhoni dropping his security in gate
😍🤌❤️@MSDhoni #MSDhoni #WhistlePodu pic.twitter.com/vhVMKqn49w— DHONI Era™ 🤩 (@TheDhoniEra) July 2, 2023