NTV Telugu Site icon

MS Dhoni: ధోనీ కోరుకుంటే.. ఇప్పటికీ టీమిండియాకు ఆడొచ్చు

Ms Dhoni India

Ms Dhoni India

MS Dhoni Could Have Still Played For India Says Wasim Akram: టీమిండియా మాజీ కెప్టెన్, వికెట్‌కీపర్ బ్యాటర్ మహేంద్ర సింగ్ ధోనీ అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పి మూడేళ్లు అవుతోంది. 2020 ఆగస్టు 15వ తేదీన ధోనీ తన రిటైర్మెంట్ ప్రకటించాడు. అయితే.. ఐపీఎల్‌లో మాత్రం ధోనీ ఇప్పటికీ ఉత్సాహంగా రాణిస్తున్నాడు. ఐపీఎల్ 2023 సీజన్‌లో మోకాలి నొప్పితో బాధపడినా.. కెప్టెన్‌గా జట్టుని సమర్థవంతంగా ముందుకు నడిపించాడు. బ్యాటర్‌గా సాధ్యమైనన్ని పరుగులు చేయడమే కాదు, కీపర్‌గా ఎప్పట్లాగే చెలరేగిపోయాడు. ఎట్టకేలకు.. తాను చెప్పినట్టుగానే ఈ ఐపీఎల్ సీజన్‌లోనూ తన చెన్నై సూపర్ కింగ్స్ జట్టుని ఛాంపియన్‌గా నిలబెట్టాడు. అంతేకాదు.. వచ్చే ఏడాది ఐపీఎల్ సీజన్‌లోనూ ఆడేందుకు అతడు సన్నద్ధమవుతున్నాడు.

బికినీలో బీభత్సం సృష్టించిన సాక్షి సాగర్ చోప్రా సందడి

ఈ క్రమంలోనే పాకిస్తాన్ మాజీ కెప్టెన్ వసీం అక్రమ్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. ధోనీ కోరుకుంటే ఇప్పటికీ భారత జట్టు కోసం ఆడొచ్చని అభిప్రాయపడ్డాడు. అయితే.. అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకోవాలని అతడు 2020 ఆగస్ట్‌లో సరైన నిర్ణయమే తీసుకున్నాడన్న తెలిపాడు. ఐపీఎల్‌లో ధోనీ ఆటతీరు చూస్తుంటే.. ఇండియాకు ఆడే సత్తా అతనిలో ఉందన్నాడు. కానీ.. అతడు సరైన టైంలో వీడ్కోలు పలికాడన్నాడు. అందుకే ధోనీ అంటే ధోనీనే అంటూ కితాబిచ్చాడు. వచ్చే ఏడాది ఐపీఎల్ సీజన్ కోసం మరింత బలంగా తిరిగొస్తాడని అభిప్రాయం వ్యక్తం చేశాడు. ధోనీ ఫిజికల్‌గా ఫిట్‌గా ఉన్నాడన్నాడు. అతనికి ఎంతో అనుభవం ఉందని, ఎప్పుడూ చాలా ప్రశాంతంగా ఉంటాడని చెప్పాడు. మరీ ముఖ్యంగా.. ఇంకా ఆడాలన్న కోరిక ధోనీలో బలంగా ఉందన్నాడు. ఆ ఆకాంక్ష ఉండబట్టే, ఐపీఎల్‌లో మెరుగ్గా రాణిస్తున్నాడన్నాడు.

Bandi Sanajay: డీలర్ల సమ్మెతో ఇబ్బంది.. రాష్ట్రంలో 91 లక్షల కుటుంబాలకు నిలిచిన రేషన్

ఒకవేళ.. ఆడాలన్న ఆకాంక్ష లేనప్పుడు, ఎంత ఫిట్‌గా ఉన్నా వ్యర్థమేనని, అప్పుడు పనితీరు చూపించలేరని వసీమ్ అక్రమ్ పేర్కొన్నాడు. ధోనీలో ఇంకా ఆట పట్ల ప్యాషన్ ఉందని చెప్పుకొచ్చాడు. ధోనీని క్రికెట్ జెమ్‌గా, కెప్టెన్ జెమ్‌గా అభివర్ణించాడు. ఓకే జట్టు తరఫున ఐదు ఐపీఎల్ టైటిల్స్ గెలవడమన్నది అంత ఆషామాషీ విషయం కాదన్నాడు. ఐపీఎల్ ఒక పెద్ద టోర్నీ అని, ఇందులో పది జట్లు ఉన్నాయని, ఒక్కో జట్టు 14 మ్యాచులు ఆడితేనే ప్లేఆఫ్‌కు వెళ్లగలవని అన్నాడు. అయితే.. ధోనీకి ఏ జట్టు ఇచ్చినా, దాన్ని ఫైనల్‌కు తీసుకెళ్లి విజయం సాధించగలడని, ఆ నైపుణ్యం ఒక్క ధోనీకి మాత్రమే ఉందని వసీమ్ పొగడ్తలు కురిపించాడు.