NTV Telugu Site icon

KL Rahul: రాహుల్ ఇన్నింగ్స్ గొప్పదేం కాదు.. మాజీ క్రికెటర్ బాంబ్

Kl Rahul

Kl Rahul

Mohammad Kaif Comments On KL Rahul Innings Against Sri Lanka: గురువారం శ్రీలంకతో జరిగిన రెండో వన్డే మ్యాచ్‌‌లో కేఎల్ రాహుల్ ఎంత అద్భుతంగా రాణించాడో అందరికీ తెలుసు! చివరివరకు క్రీజులో కుదుర్కొని.. గడ్డు పరిస్థితుల్లో ఉన్న భారత్‌ని గెలిపించి, త్రివర్ణ పతాకం రెపరెపలాడించేలా చేశాడు. అఫ్‌కోర్స్.. అతడు నిదానంగానే ఆడాడు కానీ, అత్యంత కీలకమైన పరిస్థితుల్లో మంచి ప్రదర్శన కనబరిచాడు. ఒకవేళ రాహుల్ గనుక లేకపోతే.. మ్యాచ్ రిజల్ట్ మరోలా ఉండేది. అందుకే.. ప్రతిఒక్కరూ కేఎల్ రాహుల్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. సరైన సమయంలో గొప్ప ఇన్నింగ్స్ ఆడావంటూ కితాబిస్తున్నారు. ఇప్పుడు ఈ జాబితాలో తాజాగా భారత మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ కూడా చేరిపోయాడు. అతని ఇన్నింగ్స్ గొప్పగా లేకపోయినా.. పరిణతి చెందిన బ్యాటర్‌గా సత్తా చాటాడంటూ పొగడ్తలతో ముంచెత్తాడు.

Ram Charan: చరణ్ కు అవమానం.. ఉపాసన ముందే ఇడియట్ అని తిట్టిన చిరు

మహ్మద్ కైఫ్ మాట్లాడుతూ.. ‘‘కొంతకాలం నుంచి కేఎల్ రాహుల్ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నాడు. బంగ్లాదేశ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌లో అయితే.. పేలవ ప్రదర్శన కనబర్చి, విమర్శలపాలయ్యాడు. వైస్ కెప్టెన్‌గా హోదాని కూడా కోల్పోయాడు. గత మూడు, నాలుగు నెలల నుంచి అతని పరిస్థితి మరీ ఘోరంగా తయారైంది. అయితే.. ఇప్పుడు మాత్రం ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు దిగి, రాహుల్ తన సత్తా చాటాడు. సరైన సమయంలో తనను తాను నిరూపించుకున్నాడు. జట్టు కష్టాల్లో ఉన్న వేళ ఆచితూచి ఆడాడు. పరిస్థితులకు తగ్గట్లుగా బ్యాటింగ్‌ చేశాడు. ఈ మ్యాచ్‌లో అతడు ఆడిన బ్యాటింగ్.. తన అనుభవానికి అద్దం పడుతుంది. నిజానికి.. రాహుల్ ఇన్నింగ్స్ గొప్పగా ఏమీ లేకపోవచ్చు. కానీ.. పరిణతి చెందిన బ్యాటర్ ఎలా ఉండాలో, ఈ ఒక్క ఇన్నింగ్స్‌తో కేఎల్ రాహుల్ చాటి చెప్పాడు’’ అంటూ చెప్పుకొచ్చాడు.

Delivery Boy: కుక్క ఎంత పని చేసింది.. మూడో ఫ్లోర్ నుంచి దూకి..

ఇక మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంపిక చేసుకున్న శ్రీలంక, భారత బౌలర్ల ధాటికి 215 పరుగులకే ఆలౌట్ అయ్యింది. ఈ లక్ష్యం చిన్నదే అయినప్పటికీ.. టీమిండియా టాపార్డర్ ఘోరంగా విఫలమైంది. ప్రధాన బ్యాటర్లందరూ తక్కువ స్కోర్లకే పెవిలియన్ చేరారు. అప్పుడు ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన కేఎల్ రాహుల్.. 103 బంతుల్లో 64 పరుగులతో ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు. జట్టును గెలుపు తీరాలకు చేర్చాడు. ఈ విజయంతో భారత్ మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ని 2-0 తేడాతో కైవసం చేసుకుంది.

Love Jihad: మతం మారనన్నందుకు.. భర్త కీచకపర్వం

Show comments