Site icon NTV Telugu

IPL 2023 : ఐపీఎల్ లో నేడు కీలక పోరు.. లక్నోను ఢీ కొట్టనున్న ముంబై..

Mi Vs Lsg

Mi Vs Lsg

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 సీజన్ 16లో ఎలిమినేటర్‌ మ్యాచ్‌కు రంగం సిద్దమైంది. ఇవాళ ( బుధవారం ) చెన్నై వేదికగా జరగనున్న ఈ కీలక పోరులో లక్నో సూపర్‌ జెయింట్స్‌తో ముంబై ఇండియన్స్‌ తలపడనుంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించిన జట్టు మే 26న జరగనున్న క్వాలిఫియర్‌-2లో గుజరాత్‌ టైటాన్స్‌తో తలపడనుంది. అయితే ఈ కీలక పోరులో ముంబై ఇండియన్స్‌ ఒకే ఒక మార్పుతో బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. స్పిన్నర్‌ కుమార్‌ కార్తీకేయ స్థానంలో మరో యువ స్పిన్నర్‌ హృతిక్ షోకీన్ కూడా తుది జట్టులోకి వచ్చే అవకావం కనిపిస్తుంది.

Also Read : ODI WC: వరల్డ్‌కప్‌ క్వాలిఫయింగ్‌ టోర్నీ షెడ్యూల్‌..

మరో వైపు ఇంపాక్ట్‌ ప్లేయర్‌గా తిలక్‌ వర్మ వచ్చే అవకాశం ఉంది. కాగా ఈ మ్యాచ్‌లో లక్నో సూపర్‌ జెయింట్స్‌కు ముంబై ఇండియన్స్‌ నుంచి గట్టి పోటీ ఎదురుకానుంది. ముఖ్యంగా ముంబై విధ్వంసకరమైన బ్యాటింగ్‌ లైనప్‌ ముందు కృనాల్‌ పాండ్యా ‍వ్యూహాలు ఎంతవరకు పనిచేస్తాయో అనేది మనం వేచి చూడాలి. అయితే ముంబై ఇండియన్స్‌ బౌలింగ్‌ విభాగం కాస్త వీక్‌గా ఉండడం లక్నో సూపర్ జెయింట్స్ కు కలిసొచ్చే ఆంశం అనే చెప్పుకోవాలి.

Also Read : Uttar Pradesh: మధురలో దారుణం.. 75 ఏళ్ల పూజారిని చంపిన దుండగులు..

మరోవైపు లక్నో కూడా రెండు మార్పులతో బరిలోకి దిగనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. గత రెండు మ్యాచ్‌ల్లో లక్నో సూపర్ జెయింట్స్ కు ఓపెనింగ్‌ ప్రధాన సమస్యగా మారింది. కాబట్టి ఈ​ కీలకమైన మ్యాచ్‌కు విధ్వంసకర ఓపెనర్‌ కైల్‌ మైర్స్‌ను తిరిగి తీసుకు రావాలని లక్నో మెనెజ్‌మెంట్‌ భావిస్తున్నట్లు తెలుస్తోంది. కైల్ మైర్స్‌ జట్టులోకి వస్తే.. పేసర్‌ నవీన్‌ ఉల్‌ హక్‌ బెంచ్‌కే పరిమితం కావల్సి వస్తుంది. అదే విధంగా కరణ్‌ శర్మ స్థానంలో పేసర్‌ యష్‌ఠాకూర్‌ తుది జట్టులోకి వస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి.

Exit mobile version