NTV Telugu Site icon

Marnus Labuschagne Catch: మార్నస్ లబుషేన్‌ స్టన్నింగ్ క్యాచ్.. బిత్తరపోయిన హ్యారీ బ్రూక్! వైరల్ వీడియో

Marnus Labuschagne Catch

Marnus Labuschagne Catch

Marnus Labuschagne takes Stunnar Catch to Dismiss Harry Brook in Ashes 2023: ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ మార్నస్ లబుషేన్‌ స్టన్నింగ్ క్యాచ్ అందుకున్నాడు. ఇంగ్లండ్ బ్యాటర్ హ్యారీ బ్రూక్ ఇచ్చిన క్యాచ్‌ను పక్కకు దూకుతూ అద్భుతంగా అందుకున్నాడు. దాంతో బౌండరీ ఖాయం అనుకున్న బ్రూక్.. ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యాడు. ఇంగ్లీష్ గడ్డపై జరుగుతున్న యాషెస్‌ సిరీస్‌ 2023లోని తొలి టెస్ట్ మ్యాచ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రస్తుతం ఇందుకుసంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఆస్ట్రేలియా ముందు భారీ లక్ష్యం ఉంచాలనే ఉద్దేశంతో రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ దూకుడుగా ఆడింది. టాప్ ఆర్డర్ విఫలమయినా జో రూట్ (46), హ్యారీ బ్రూక్ (46) క్రీజులో నిలబడ్డారు. ముఖ్యంగా బ్రూక్ ధనాధన్ షాట్లతో పరుగులు చేశాడు. 52 బంతుల్లో ఐదు ఫోర్లతో 46 పరుగులు చేశాడు. హాఫ్ సెంచరీ చేసేలా కనిపించిన అతడు నాథన్ లియాన్ బౌలింగ్‌లో తడబడ్డాడు. హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోవాలనే తొందరలో లెగ్ సైడ్ బౌండరీ బాదేందుకు భారీ షాట్ ఆడాడు. అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న మార్నస్ లబుషేన్.. డైవ్ చేసి మరీ స్టన్నింగ్ క్యాచ్‌ అందుకున్నాడు.

Also Read: Ashes 2023: రసవత్తరంగా యాషెస్‌ తొలి టెస్ట్.. ఆస్ట్రేలియాకు 174 రన్స్, ఇంగ్లండ్‌కు 7 వికెట్లు!

బంతి గాల్లో ఉండగానే మార్నస్ లబుషేన్ పక్షి లాగ దూకుతూ క్యాచ్ పట్టేశాడు. దీంతో హాఫ్ సెంచరీకి నాలుగు పరుగుల దూరంలో బ్రూక్ ఔట్ అయ్యాడు. ఈ క్యాచ్ చూసిన హ్యారీ బ్రూక్ బిత్తరపోయాడు. మరోవైపు మైదానంలోని ఫ్యాన్స్ సైతం షాక్ అయ్యారు. లబుషేన్ ఫీల్డింగ్‌కు సంబందించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియో చుసిన నెటిజన్లు.. ‘సూపర్ ఫీల్డింగ్’, ‘స్టన్నింగ్ క్యాచ్’ అని కామెంట్స్ చేస్తున్నారు.

తొలి టెస్ట్ రసవత్తరంగా మారింది. ఈ టెస్ట్ గెలవడానికి ఆస్ట్రేలియాకు, ఇంగ్లండ్‌కు 50-50 అవకాశాలు ఉన్నాయి. చివరి రోజు ఆసీస్ గెలవడానికి 174 పరుగులు అవసరం కాగా.. ఇంగ్లండ్‌కు 7 వికెట్స్ కావాలి. దాంతో ఐదవ రోజు ఇరు జట్లు ఢీ అంటే ఢీ అన్నట్లు తలపడనున్నాయి. తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ 393/8 పరుగుల వద్ద డిక్లేర్ చేయగా.. ఆసీస్ 386 పరుగులకు ఆలౌట్ అయింది. రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ 273 పరుగులకే ఆలౌట్ కాగా.. ఆసీస్ 281 పరుగుల లక్ష్య ఛేదనకు దిగింది.

Show comments