Site icon NTV Telugu

Mumbai Indians: ముంబై ఇండియన్స్‌కు కొత్త కోచ్ వచ్చేశాడు..!!

Mark Boucher

Mark Boucher

Mumbai Indians: ఈ ఏడాది ఐపీఎల్‌లో చెత్త ప్రదర్శన చేసిన ముంబై ఇండియన్స్ జట్టుకు వచ్చే ఐపీఎల్ సీజన్‌లో కొత్త కోచ్ రానున్నాడు. ఈ మేరకు ప్రధాన కోచ్‌గా మార్క్ బౌచర్‌ను ముంబై ఇండియన్స్ నియమించింది. ఐపీఎల్ 2023 నుంచి తమ జట్టు ప్రధాన కోచ్‌గా దక్షిణాఫ్రికా క్రికెట్ దిగ్గజం మార్క్ బౌచర్‌ను నియమించినట్లు ముంబై ఇండియన్స్ ప్రకటించింది. వికెట్ కీపర్‌, బ్యాట్స్‌మన్‌గా బౌచర్ కీలక ఆటగాడిగా పేరు పొందాడు. క్రికెట్ నుంచి వైదొలిగిన తర్వాత దక్షిణాఫ్రికాలో అగ్రస్థాయి క్రికెట్ ఫ్రాంచైజీ టైటాన్స్‌కు కోచ్‌గా బౌచర్ బాధ్యతలు నిర్వర్తించాడు. బౌచర్ కోచింగ్‌లో టైటాన్స్ జట్టు ఐదు దేశవాళీ టైటిళ్లను తన ఖాతాలో వేసుకుంది. ఆ తర్వాత 2019లో దక్షిణాఫ్రికా కోచ్‌గా బౌచర్ సేవలు అందించాడు. అతడి హయాంలో దక్షిణాఫ్రికా జట్టు 11 టెస్టు విజయాలు, 12 వన్డే విజయాలు, 23 టీ20 విజయాలను సొంతం చేసుకుంది.

Read Also: Leonardo DiCaprio: శృంగారం చేసేటప్పుడు ‘టైటానిక్’ హీరో ఆ పని చేస్తాడట.. అందుకే బ్రేకప్స్

కాగా ఈ ఏడాది వరకు ముంబై కోచ్‌గా పనిచేసిన మహేల జయవర్ధనేకు కొత్త బాధ్యతలు అప్పగించారు. ముంబై ఇండియన్స్‌కు సంబంధించి గ్లోబ్ హెడ్ ఆఫ్ పర్ఫార్మెన్స్ బాధ్యతలను జయవర్ధనే నిర్వర్తించనున్నాడు. కాగా మార్క్ బౌచర్‌ను ముంబై ఇండియన్స్ ఫ్యామిలీకి స్వాగతించడం ఆనందంగా ఉందని.. ఆయన మార్గదర్శకంతో కోచ్‌గా జట్టును అనేక విజయాల వైపునకు నడిపిస్తాడని జట్టు వారసత్వాన్ని బౌచర్ ముందుకు తీసుకువెళ్తాడని ముంబై టీమ్ యాజమానులలో ఒకరైన ఆకాష్ అంబానీ పేర్కొన్నారు. మార్క్ బౌచర్‌ను కోచ్‌గా నియమించడం వల్ల అటు దక్షిణాఫ్రికా టీ20 లీగ్‌లోని ఎంఐ కేప్‌టౌన్ జట్టుకు, ఇటు ముంబై ఇండియన్స్ జట్టుకు రెండు రకాలుగా యూజ్ అవుతుందని ఆకాష్ అంబానీ ప్లాన్ చేసినట్లు క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Exit mobile version