Site icon NTV Telugu

IPL 2022: ముచ్చటగా మూడో విజయం సాధించిన లక్నో

Lucknow 1

Lucknow 1

ఐపీఎల్ 2022లో కొత్తగా ప్రవేశించిన ల‌క్నోసూప‌ర్ జెయింట్స్ టీమ్ జోరు కొన‌సాగుతోంది. గురువారం రాత్రి ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. తద్వారా మూడో విజయాన్ని నమోదు చేసింది. తొలుత బౌలింగ్‌లో ఢిల్లీ క్యాపిట‌ల్స్‌ను త‌క్కువ స్కోర్‌కే క‌ట్టడి చేసిన ల‌క్నో.. అనంత‌రం బ్యాటింగ్‌లో డికాక్ భారీ ఇన్నింగ్స్‌తో చెల‌రేగ‌డంతో గెలుపు అందుకుంది. డికాక్ 52 బంతుల్లో 9 ఫోర్లు, రెండు సిక్సర్ల సహాయంతో 80 పరుగులు చేశాడు.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 149 పరుగులు మాత్రమే చేసింది. పృథ్వీ షా 34 బంతుల్లో 61 పరుగులు సాధించాడు. అయితే మిగతా బ్యాట్స్‌మెన్ వేగంగా ఆడలేకపోయారు. అనంతరం 150 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన లక్నోకు ఓపెనర్లు కేఎల్ రాహుల్, డికాక్ మంచి ఆరంభం అందించారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 9.4 ఓవ‌ర్లలో 73 ప‌రుగులు భాగ‌స్వామ్యాన్ని నెలకొల్పారు. రాహుల్ అవుటైనా డికాక్ తన జోరు చూపించాడు. కృనాల్ పాండ్యా (19 నాటౌట్), బదోనీ (10 నాటౌట్) చివరి ఓవర్‌లో తమ జట్టును గెలిపించారు. ఢిల్లీ బౌలర్లలో రవి బిష్ణోయ్ మూడు వికెట్లు తీయగా… కృష్ణప్ప గౌతమ్‌కు ఒక వికెట్ దక్కింది.

https://ntvtelugu.com/mohammad-kaif-commets-on-mumbai-indians-performance-in-ipl-2022/

Exit mobile version