Site icon NTV Telugu

LSG vs RR: లక్నో చేతిలో రాజస్థాన్ రాయల్స్ ఓటమి.. అదే కొంపముంచింది

Lsg Won The Match

Lsg Won The Match

Lucknow Super Giants Won The Match By 10 Runs Against Rajasthan Royals: సవాయి మాన్‌సింగ్ ఇండోర్ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ చేతిలో రాజస్థాన్ రాయల్స్ ఓటమి పాలైంది. లక్నో నిర్దేశించిన 155 పరుగుల లక్ష్యాన్ని రాజస్థాన్ ఛేధించలేకపోయింది. 144 పరుగులకే పరిమితం అయ్యింది. దీంతో.. లక్నో జట్టు 10 పరుగుల తేడాతో విజయం సాధించింది. లక్ష్యం చిన్నదే కావడంతో.. రాజస్ధాన్ జట్టు మొదట్నుంచే నిర్లక్ష్యం చేసింది. ఓపెనర్లు పవర్ ప్లేలో పరుగులు చేయకుండా, చాలా బంతులు వృధా చేశారు. భారీ షాట్లు బాదకుండా.. ఒకట్రెండు పరుగులతోనే కాలక్షేపం చేశారు. ఇక శాంసన్, హెట్‌మేయర్ వంటి విధ్వంసకర ఆటగాళ్లు వెనువెంటనే ఔట్ అవ్వడంతో.. రాజస్థాన్ భారీ మూల్యం చెల్లించుకోవలసి వచ్చింది.

Surekha Vani: పవన్ తో డేటింగ్.. వంద ముద్దులు.. ఛీఛీ.. కొంచమైనా సిగ్గుగా అనిపించడం లేదా

తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన లక్నో జట్టు.. నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 154 పరుగులే చేసింది. ఓపెనర్లు కేఎల్ రాహుల్, కైల్ మేయర్స్ నిదానంగా ఇన్నింగ్స్ ప్రారంభించడంతో.. లక్నో స్కోరు నత్తనడక సాగింది. పవర్ ప్లే ముగిసిన తర్వాత కాస్త జోరు పెంచారు కానీ, మరీ విజృంభించి ఆడలేదు. వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు కొట్టారంతే! ఈ క్రమంలోనే కేఎల్ రాహుల్ 82 పరుగుల వద్ద ఔటయ్యాడు. ఇక అప్పటి నుంచి వరుసగా వికెట్లు పడుతూ వచ్చాయి. దీంతో.. లక్నో స్కోరు మళ్లీ నెమ్మదించింది. భారీ షాట్లతో విరుచుకుపడే కైల్ మేయర్స్ కూడా ఈసారి సాదాసీదా ఆటతోనే లాగించేశాడు. 42 బంతులు ఆడిన అతడు.. 3 సిక్సర్లు, 4 ఫోర్ల సహాయంతో 51 పరుగులు చేశాడు. మార్కస్ (21), పూరన్ (29) సోసోగా రాణించారంతే! ఫలితంగా.. లక్నో జట్టు 154 పరుగులకే పరిమితం అయ్యింది.

Reels on Instagram: బైక్ పై రీల్స్ చేసిన యువతి.. పోలీసులేం చేశారంటే?

ఇక 155 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ జట్టు.. లక్ష్యం చిన్నదే కావడంతో నిర్లక్ష్యంగా రాణించింది. ఏదో టెస్ట్ మ్యాచ్ ఆడుతున్నట్టు.. ఓపెనర్లు జైస్వాల్, బట్లర్ నిదానంగా ఇన్నింగ్స్ ఆడారు. సరిగ్గా జోరు అందుకునే సమయంలో.. ఇద్దరూ పెవిలియన్ బాట పట్టారు. అనంతరం సంజూ శాంసన్ రనౌట్ అవ్వగా.. హెట్‌మేయర్ అనవసరమైన షాట్ ఆడి క్యాచ్ ఔట్ అయ్యాడు. తమ జట్టుని గెలిపించుకోవడం కోసం దేవదత్ పడిక్కల్, రియాన్ పరాగ్ ప్రయత్నించారు కానీ.. ఫలితం లేకుండా పోయింది. లక్నో బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ వేయడంతో.. భారీ షాట్లు బాదే అవకాశం రాజస్థాన్ బ్యాటర్లకు రాలేదు. దీంతో.. 144 పరుగులకే రాజస్థాన్ పరిమితం కావడంతో, 10 పరుగుల తేడాతో లక్నో గెలుపొందింది.

Exit mobile version