NTV Telugu Site icon

SRH vs LSG: సన్‌రైజర్స్‌పై లక్నో విజయం.. 16 ఓవర్లలోనే సమాప్తం

Lsg Won By 5 Wickets

Lsg Won By 5 Wickets

Lucknow Super Giants Won By 5 Wickets Against Sunrisers Hyderabad: శుక్రవారం ఏకన స్పోర్ట్స్ సిటీ వేదికగా జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుపై లక్నో సూపర్ జెయింట్స్ విజయం సాధించింది. ఆ జట్టు నిర్దేశించిన 122 పరుగుల లక్ష్యాన్ని 5 వికెట్ల తేడాతో 16 ఓవర్లలోనే లక్నో ఛేధించింది. లక్ష్యం చిన్నదే కావడంతో.. లక్నో ఆటగాళ్లు సునాయాసంగా మ్యాచ్‌ని ముగించేశారు. హడావుడి చేయకుండా.. ఆడుతూ పాడుతూ లక్ష్యాన్ని ఛేధించి గెలుపొందారు. ఛాన్స్ దొరికినప్పుడల్లా సన్‌రైజర్స్ బౌలర్లు కీలకమైన వికెట్లు తీయగలిగారు కానీ, లక్ష్యం మరీ చిన్నది కావడంతో డిఫెండ్ చేయడం కష్టమైపోయింది. అటు.. లక్నో బ్యాటర్లు తమవంతు కృషి అందించి, టార్గెట్‌ని అలవోకగా ఛేధించడంలో కీలక పాత్ర పోషించారు.

తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంపిక చేసుకున్న సన్‌రైజర్స్.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 121 పరుగులే చేసింది. భారీ అంచనాలు పెట్టుకున్న ఖరీదైన ఆటగాళ్లందరూ (మయాంక్ అగర్వాల్, కెప్టెన్ ఎయిడెన్ మర్ర్కమ్, హ్యారీ బ్రూక్) చెత్త ప్రతిభతో తీవ్ర నిరాశపరిచారు. మర్ర్కమ్ అయితే గోల్డెన్ డక్‌గా వెనుదిరిగాడు. ఓపెనర్ అన్మోల్‌ప్రీత్ సింగ్ (26 బంతుల్లో 31) ఒక్కడే కాస్త ఫర్వాలేదనిపించాడు. మధ్యలో రాహుల్ త్రిపాఠి, వాషింగ్టన్ సుందర్ నిదానంగా ఇన్నింగ్స్ కొనసాగించారు. మరో వికెట్ పడకుండా ఉండేలా.. జాగ్రత్తగా బ్యాటింగ్ చేశారు. ఈ క్రమంలో బంతులు ఎక్కువగా అయిపోయాయే తప్ప.. స్కోరు బోర్డు మాత్రం నత్తనడకన సాగింది. చివర్లో వచ్చిన అబ్దుల్ సమద్ రెండు సిక్సులు, ఒక ఫోర్‌తో చెలరేగడంతో.. సన్‌రైజర్స్ స్కోరు 121కి చేరింది. ఒకవేళ అబ్దుల్ లేకపోయి ఉంటే.. సన్‌రైజర్స్ 100 పరుగుల మైలురాయిని అందుకోవడం కూడా గగనంలా కనిపించింది.

Shraddha Das: స్విమ్ సూట్ లో చిన్నది సెగలు రేపుతోంది

ఇక 122 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో జట్టు.. 16 ఓవర్లలోనే 126 పరుగులు చేసి, లక్ష్యాన్ని ఛేధించింది. స్వల్ప లక్ష్యమే కావడంతో.. లక్నో ఆటగాళ్లు పెద్దగా కష్టపకుండా, సరదాగా ఆడుతూ పాడుతూ అలవోకగా లక్ష్యాన్ని ఛేధించి గెలుపొందారు. ఈ మ్యాచ్‌లో కృనాల్ పాండ్యా హైలైట్ అయ్యాడు. బౌలింగ్‌లో మూడు వికెట్లు తీసిన అతగాడు.. తన బ్యాట్‌తోనూ మెరుపులు మెరిపించాడు. 34 వ్యక్తిగత పరుగులు చేశాడు. అయితే.. ఒక షాట్ కొట్టబోయి అన్మోల్‌కి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఈ విజయంతో లక్నో రన్‌రేట్ అమాంతం పెరగడంతో.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి ఎగబాకింది.