NTV Telugu Site icon

SRH vs LSG: ఆడుతూ పాడుతూ లాగించేస్తున్న లక్నో.. 10 ఓవర్లలో స్కోరు ఇది

Lsg Scores 10 Overs

Lsg Scores 10 Overs

Lucknow Super Giants Scored 82 With Two Wickets Lost In 10 Overs: శుక్రవారం ఏకన స్పోర్ట్స్ సిటీ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య మ్యాచ్ జరుగుతున్న విషయం తెలిసిందే! తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ 122 పరుగుల లక్ష్యాన్ని లక్నోకి నిర్దేశించింది. లక్ష్యం చిన్నదే కావడంతో.. లక్నో జట్టు ఆడుతూ పాడుతూ లాగించేస్తోంది. ఇప్పటివరకూ 10 ఓవర్లు అయిపోగా.. రెండు వికెట్ల నష్టానికి లక్నో జట్టు 82 పరుగులు చేసింది. లక్ష్యాన్ని అందుకోవాలంటే మరో 10 ఓవర్లలో 40 పరుగులు చేయాలి. తొలుత క్రీజులోకి వచ్చిన ఓపెనర్లు.. తొలి వికెట్‌కి 35 పరుగుల భాగస్వామ్యాన్ని జోడించారు. తాను క్రీజులో కుదురుకోవడంతో.. కైల్ మేయర్స్ ఖాతా తెరవడం మొదలుపెట్టాడు. ఈ క్రమంలోనే అతడు ఫారుఖీ బౌలింగ్‌లో 35 స్కోరు వద్ద మయాంక్ అగర్వాల్‌కి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఆ తర్వాత వచ్చిన దీపక్ హుడా కూడా ఒక సిక్స్ కొట్టి, 7 వ్యక్తిగత పరుగులకే భువనేశ్వర్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.

Jogi Ramesh: అది సెల్ఫీల పార్టీ.. చార్మినార్, తాజ్‌మహల్ తానే కట్టేశానని ఓ సెల్ఫీ తీసుకుంటారేమో..!

హుడా వెళ్లిన తర్వాత క్రీజులోకి వచ్చిన కృనాల్ పాండ్యా.. ఆచితూచి ఆడుతూ, వీలు చిక్కినప్పుడల్లా భారీ షాట్లు బాదాడు. అటు.. కేఎల్ రాహుల్ కూడా మరో వికెట్ పడకుండా ఉండాలన్న ఉద్దేశంతో, టెంప్ట్ అవ్వకుండా జాగ్రత్తగా ఆడుతున్నాడు. ప్రత్యర్థి బౌలర్లకు వికెట్ తీసే అవకాశం ఇవ్వట్లేదు. లక్ష్యం చిన్నదే కావడం, బంతులు ఎక్కువగా ఉండటంతో.. నిదానంగానే ఇన్నింగ్స్ కొనసాగిస్తున్నాడు. ఫలితంగా.. 10 ఓవర్లు ముగిసేసరికి లక్నో 82 పరుగులు చేసింది. నిజానికి.. సన్‌రైజర్స్ బౌలర్లు వెనువెంటనే రెండు వికెట్లు తీయడంతో, ఇక సన్‌రైజర్స్ ట్రాక్‌లోకి వచ్చిందని అనుకున్నారు. కానీ.. లక్నో బ్యాటర్లు వారికి మరో వికెట్ తీసే ఛాన్స్ ఇవ్వకుండా, వారి ఆశలపై నీరుగార్చేశారు. 10 ఓవర్లు ముగిసే సమయానికి కేఎల్ రాహుల్ (30), కృనాల్ (23) పరుగులతో క్రీజులో ఉన్నారు.