Site icon NTV Telugu

CSK vs LSG: టాస్ గెలిచిన లక్నో.. బ్యాటింగ్‌కి దిగిన చెన్నై

Csk Vs Lsg

Csk Vs Lsg

LSG Won The Toss And Chose To Bowl: ఐపీఎల్‌-2023 సీజన్‌లో భాగంగా ఎంఏ చిదంబరం స్టేడియం వేదికగా చెన్నై సూపర్‌ కింగ్స్‌, లక్నో సూపర్‌ జెయింట్స్‌ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన లక్నో ఫీల్డింగ్ ఎంపిక చేసుకోవడంతో.. చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటింగ్ చేసేందుకు రంగంలోకి దిగింది. లక్నో జట్టులో జయదేవ్‌ ఉనద్కట్‌ స్ధానంలో రవిసింగ్ ఠాకూర్‌ని తీసుకోగా.. చెన్నై జట్టులో మాత్రం ఎలాంటి మార్పులు చేయలేదు. ఆల్రెడీ ఈ సీజన్ ప్రారంభంలో గుజరాత్ టైటాన్స్ చేతిలో చెన్నై ఓటమి చవిచూసింది కాబట్టి.. ఈ మ్యాచ్‌లో విజయం సాధించాలన్న కసితో బరిలోకి దిగింది. ఇక లక్నో జట్టు ఆల్రెడీ ఢిల్లీ క్యాపిటల్స్‌పై తొలి విజయాన్ని నమోదు చేసంది కాబట్టి, అదే జోరుని కొనసాగించాలని చూస్తోంది.

Tanisha Kuppanda: అడల్ట్ సినిమాలో నగ్నంగా నటించే ఆఫర్.. నటి ఏం చెప్పిందంటే?

ఈ ఇరుజట్లు కూడా బ్యాటింగ్, బౌలింగ్ పరంగా పటిష్టమైనవే! ఈ రెండు జట్లలో పరుగుల వర్షం కురిపించే విధ్వంసకర ఆటగాళ్లు ఉన్నారు. అలాగే.. మలుపు తిప్పే అనుభవజ్ఞులైన బౌలర్లూ ఉన్నారు. దీంతో.. ఈ మ్యాచ్‌లో ఎవరు విజయం సాధిస్తారన్నది సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఎంఎస్ ధోనీ పుణ్యమా అని.. చెన్నైకి ముందు నుంచే భారీ ఫ్యాన్ బేస్ ఉంది కాబట్టి, చెన్నై జట్టే గెలవాలని చాలామంది కోరుకుంటున్నారు. చూద్దాం.. ఈ పోరులో ఎవరు పైచేయి సాధిస్తారో? ఇదిలావుండగా.. నాలుగేళ్ల తర్వాత చెపాక్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తొలి మ్యాచ్‌ ఆడుతోంది. దీంతో.. స్టేడియం మొత్తం ధోనీ నామస్మరణంతో మార్మోగిపోతోంది. ఎంతైనా చెన్నై జట్టుకి హోమ్ గ్రౌండ్ కాబట్టి.. మైదానంలో ఆ జట్టుకే ఎక్కువ మద్దతు ఉంది.

Natural Star Nani: ‘దసరా’ లాంటి సినిమా మళ్లీ చేయను.. బాంబ్ పేల్చిన నాని

లక్నో సూపర్ జెయింట్స్ : కైల్ మేయర్స్, లోకేష్ రాహుల్ (కెప్టెన్‌), దీపక్ హుడా, మార్కస్ స్టోయినిస్, నికోలస్ పూరన్ (వికెట్‌ కీపర్‌), ఆయుష్ బడోని, కృనాల్ పాండ్యా, అవేష్ ఖాన్, మార్క్ వుడ్, రవి బిష్ణోయ్, యశ్ రవిసింగ్ ఠాకూర్
చెన్నై సూపర్ కింగ్స్ : డెవాన్ కాన్వే, రుతురాజ్ గైక్వాడ్, మొయిన్ అలీ, బెన్ స్టోక్స్, అంబటి రాయుడు, శివమ్ దూబే, ఎస్‌ ధోని (కెప్టెన్‌, వికెట్‌ కీపర్‌), రవీంద్ర జడేజా, మిచెల్ సాంట్నర్, దీపక్ చాహర్, రాజవర్ధన్ హంగర్గేకర్

Exit mobile version