Legends League Cricket: మాజీ స్టార్ క్రికెటర్లు పాల్గొనే లెజెండ్స్ లీగ్ క్రికెట్ సెకండ్ సీజన్ ప్రారంభం కాబోతోంది. మొదటి మ్యాచ్ సెప్టెంబర్ 15న కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో జరగనున్నట్లు లెజెండ్ లీగ్ క్రికెట్ నిర్వాహకులు శుక్రవారం వెల్లడించింది. భారత్ స్వాతంత్య్రం పొంది 75 ఏళ్లు అయిన సందర్భంగా ప్రత్యేక మ్యాచ్ జరుగబోతోంది. ఇండియా మహారాజాస్, వరల్డ్ జెయింట్స్ మధ్య ప్రత్యేక మ్యాచ్ ఉండనుంది. ఈ మ్యాచులో మొత్తం 10 దేశాలకు చెందిన క్రికెట్ ప్లేయర్లు పాల్గొంటారు.
ఈ మ్యాచ్ అనంతరం సెప్టెంబర్ 16, 2022 నుంచి లీగ్ మ్యాచులు ప్రారంభం కానున్నాయి. మొత్తం 4 జట్లు లెజెండ్స్ లీగ్ క్రికెట్ ఫ్రాంచైజీ ఫార్మాట్ లో పోటీపడనున్నాయి. మొత్తం 15 మ్యాచులు జరగనున్నాయి. ఇండియా 75 ఇండిపెండెంట్స్ డే సందర్భంగా నిర్వహిస్తున్న స్పెషల్ మ్యాచుపై లెజెండ్స్ లీగ్ క్రికెట్ కమీషనర్ రవిశాస్త్రి మాట్లాడారు. స్వాతంత్య్రం సాధించి 75 ఏళ్లు అవుతున్న సందర్భం ప్రతీ భారతీయుడికి గర్వకారణం అని అన్నారు. ఈ సారి లీగ్ ను భారత 75వ స్వాతంత్య్రానికి అంకితం ఇచ్చారు.
Read Also: TS Eamcet 2022: తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదల.. టాప్ ర్యాంకర్లు వీరే
జట్ల వివరాలు:
ఇండియ మహరాజాస్: సౌరవ్ గంగూలీ (సి), వీరేంద్ర సెహ్వాగ్, మహ్మద్ కైఫ్, యూసుఫ్ పఠాన్, ఎస్ బద్రీనాథ్, ఇర్ఫాన్ పఠాన్, పార్థివ్ పటేల్, స్టువర్ట్ బిన్నీ, ఎస్ శ్రీశాంత్, హర్భజన్ సింగ్, నమన్ ఓజా, అశోక్ దిండా, ప్రజ్ఞాన్ ఓజా, అజయ్ సింగ్ జడేజా, , జోగిందర్ శర్మ
వరల్డ్ జెయింట్స్: ఇయాన్ మోర్గాన్ (సి), లెండిల్ సిమన్స్, హెర్షెల్ గిబ్స్, జాక్వెస్ కల్లిస్, సనత్ జయసూర్య, మాట్ ప్రియర్, నాథన్ మెకల్లమ్, జాంటీ రోడ్స్, ముత్తయ్య మురళీధరన్, డేల్ స్టెయిన్, హామిల్టన్ మసకద్జా, మష్రాఫ్ మోర్టాజా, అస్గ్హర్ మోర్టాజా, అస్గ్‌హర్‌ట్‌జాన్ అఫ్ట్‌సన్, కెవిన్ ఓ’బ్రియన్, దినేష్ రామ్‌దిన్