Site icon NTV Telugu

చరిత్ర సృష్టించిన భారత షట్లర్.. ప్రపంచ ఛాంపియన్‌కే షాక్

భారత యువ షట్లర్ లక్ష్యసేన్ చరిత్ర సృ‌‌ష్టించాడు. ఇండియా ఓపెన్ 2022లో ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో సింగపూర్ ఆటగాడు, వరల్డ్ ఛాంపియన్ లొహ్ కియన్ యూని 24-21, 21-17 స్కోరు తేడాతో ఓడించాడు. లక్ష్యసేన్‌కు ఇదే తొలి టైటిల్. అంతేకాకుండా ఈ టైటిల్‌ను గెలుచుకున్న మూడో భారత పురుష ఆటగాడిగా లక్ష్యసేన్ నిలిచాడు. అతని కంటే ముందు 1981లో ప్రకాష్ పదుకొణె, ఆ తర్వాత 2015లో కిదాంబి శ్రీకాంత్ తొలి సూపర్ 500 ఛాంపియన్‌షిప్ టైటిల్‌ను గెలుచుకున్నారు.

Read Also: వీసా రద్దు నిర్ణయం.. ఆస్ట్రేలియా ఓపెన్ నుంచి జకోవిచ్ ఔట్

ఈ మ్యాచ్‌లో ప్రపంచ చాంపియన్ ముందు లక్ష్యసేన్ దూకుడుగా షాట్లు ఆడి టైటిల్ గెలిచాడు. ఈ మ్యాచ్‌లో లక్ష్యసేన్ కేవలం 54 నిమిషాల్లో విజయం సాధించాడు. గత ఏడాది ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో కాంస్య పతకాన్ని సాధించి లక్ష్య సేన్ మెరుపులు మెరిపించాడు. ప్రస్తుతం ఈ టైటిల్‌ను తన బ్యాగ్‌లో వేసుకుని పలు రికార్డులను కొల్లగొట్టాడు. మరోవైపు పురుషుల డబుల్స్‌ విభాగంలోనూ సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి కలిసి ఇండోనేషియన్ జంటను ఓడించి టైటిల్ సొంతం చేసుకున్నారు.

Exit mobile version