kurchi madatha petti Song in Every where: మహేష్ బాబు నటించిన “గుంటూరు కారం” ఈ ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. డైరెక్టర్ త్రివిక్రమ్ తెరకెక్కించిన ఈ ఫ్యామిలీ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ లో మహేష్ బాబు సరసన శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటించారు. ఈ సినిమాను హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై సూర్యదేవర రాధాకృష్ణ నిర్మించారు.ఇక ఈ సినిమాలో పాటలు సోషల్ మీడియాలో ప్రపంచమంతా వైరల్ అవుతున్నాయి.. ముఖ్యంగా కుర్చీని మడతపెట్టి సాంగ్ జనాలను బాగా ఆకట్టుకుంది..మహేష్, శ్రీలీల ఈ సాంగ్ లో మాస్ స్టెప్పులు వేయడంతో థియేటర్స్ దద్దరిల్లిపోయాయి.
Also Read; Family Star: ఫ్యామిలి స్టార్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎక్కడో తెలుసా..?
సినిమా వచ్చి మూడు నెలలు అయిన కూడా ఈ పాటకు రీల్స్ చేస్తు.. నెట్టింట ట్రెండ్ చేస్తున్నారు..ఇప్పటికే ఇండియాలో వేరే రాష్ట్రాల్లో పలు కాలేజీ ఈవెంట్స్ లో ఈ సాంగ్ ని వాడేస్తూ స్టెప్పులేస్తున్నరూ . ఇప్పుడు ఈ సాంగ్ ఇంటర్నేషనల్ ఆడియన్స్ ని కూడా ఉత్సాహపరుస్తుంది. అమెరికా టెక్సాస్ లో నేషనల్ బాస్కెట్ బాల్ గేమ్స్ జరుగుతున్నాయి. ఈ గేమ్స్ మధ్య బ్రేక్ టైం లో “కుర్చీని మడతపెట్టి” సాంగ్ ని ప్లే చేసారు. ఇంకేముంది అమెరికన్స్ అందరూ వాళ్ళ స్టైల్స్ లో ఓ రేంజ్ లో స్టెప్పులేసి అలరించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Witness the #KurchiMadathaPetti mania spreading globally! 🔥
Superstar @urstrulymahesh‘s electrifying #KurchiMadathaPetti dance lit up the Toyota Center in Houston during the NBA game halftime ❤️🔥#GunturKaaram pic.twitter.com/rAioO44EcW
— Guntur Kaaram (@GunturKaaram) April 1, 2024