Site icon NTV Telugu

Kuldeep Yadav Marriage Date: ముహూర్తం ఫిక్స్.. పెళ్లిపీటలెక్కనున్న కుల్దీప్ యాదవ్, పెళ్లి కూతురు ఎవరంటే?

Kuldeep Yadav Marriage Date

Kuldeep Yadav Marriage Date

Kuldeep Yadav to Wed Childhood Friend Vanshika on March 14: టీమిండియా స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ త్వరలో పెళ్లి పీటలెక్కనున్నాడు. తన చిన్ననాటి స్నేహితురాలు వన్సికను వివాహం చేసుకోబోతున్నాడు. ఈ జంట మార్చి 14న ఉత్తరాఖండ్‌లోని ముస్సోరి రిసార్ట్‌లో వివాహ బంధంతో ఒక్కటవనున్నారు. పెళ్లి వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. టీ20 వరల్డ్ కప్ 2026 దృష్ట్యా కుల్దీప్ తన వివాహాన్ని వాయిదా వేసుకున్నాడు. మెగా టోర్నీ ముగిసిన నేపథ్యంలో కుల్దీప్ పెళ్లికి సిద్దమైపోయాడు.

మార్చి 8న కుల్దీప్ యాదవ్ తండ్రి రామ్ సింగ్ యాదవ్ లక్నోలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను కలిసి పెళ్లికి ఆహ్వానించారు. కుల్దీప్, వంశిక జంట 2025 జూన్ 4న లక్నోలో నిశ్చితార్థం చేసుకున్నారు. ముందుగా వివాహం 2025 నవంబర్‌లో జరుగుతుందని వార్తలు వచ్చాయి. అయితే భారత జట్టు బిజీ షెడ్యూల్, వరల్డ్ కప్ 2026 కారణంగా పెళ్లి వాయిదా పడింది. ఇప్పుడు టీ20 ప్రపంచ కప్ విజయానంతరం కుల్దీప్ తన జీవితంలో కొత్త ఇన్నింగ్స్ ప్రారంభించబోతున్నాడు. పెళ్లి వేడుకలు మార్చి 13 నుంచి ప్రారంభమవుతాయి. ఆ రోజు హల్దీ, మెహందీ కార్యక్రమాలు జరగనున్నాయి. మార్చి 14న వివాహం జరుగుతుంది. మార్చి 17న లక్నోలోని హోటల్ సెంట్రంలో ఘనంగా రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నారు. ఈ కార్యక్రమానికి భారత క్రికెట్ జట్టు ఆటగాళ్లతో పాటు విదేశీ క్రికెటర్లు, బాలీవుడ్ ప్రముఖులు, ఉత్తరప్రదేశ్‌కు చెందిన రాజకీయ నేతలు హాజరయ్యే అవకాశముంది.

Also Read: Jana Sena Formation Day 2026: జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు.. రాష్ట్ర స్థాయి వేడుకల్లో మార్పు!

కుల్దీప్ యాదవ్, వంశికలు చిన్నప్పటి నుంచే స్నేహితులు. వంశిక కాన్పూర్‌లోని శ్యామ్ నగర్ ప్రాంతానికి చెందినది. ప్రస్తుతం ఆమె ఎల్‌ఐసీలో ఉద్యోగం చేస్తోంది. మరోవైపు కుల్దీప్ కాన్పూర్‌లోని లాల్ బంగ్లా ప్రాంతంలో నివసిస్తున్నాడు. ఈ రెండు ప్రాంతాల మధ్య దూరం కేవలం మూడు కిలోమీటర్లే. చిన్ననాటి స్నేహం క్రమంగా ప్రేమగా మారి ఇప్పుడు పెళ్లి బంధంగా మారబోతోంది.

కుల్దీప్ యాదవ్ 1994 డిసెంబర్ 14న ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్ జిల్లాలో జన్మించాడు. అతడి తండ్రి ఇటుక బట్టీ వ్యాపారం చేసేవారు. క్రికెట్‌పై అతడికి ఉన్న ఆసక్తి వల్లనే కుల్దీప్‌ను క్రికెటర్‌గా తీర్చిదిద్దాలని నిర్ణయించుకున్నారు. మొదట్లో కుల్దీప్‌కు క్రికెట్ అంటే అంతగా ఇష్టం లేకపోయినా.. క్రమంగా కష్టపడి భారత జట్టులో స్థానం సంపాదించాడు. ప్రస్తుతం టీమిండియాలో కీలక స్పిన్నర్‌గా నిలిచిన కుల్దీప్.. ఇప్పుడు తన వ్యక్తిగత జీవితంలో కూడా కొత్త అధ్యాయం ప్రారంభించబోతున్నాడు.

Exit mobile version