Site icon NTV Telugu

Krishna Pandey: ఆరు బంతుల్లో ఆరు సిక్స్‌లు.. టీ10 చరిత్రలో తొలి ఆటగాడు

Krishna Pandey Six Sixes

Krishna Pandey Six Sixes

ఆరు బంతుల్లో ఆరు సిక్స్‌లు.. ఈ రికార్డ్ గురించి మాట్లాడితే మనకు మొదటగా గుర్తొచ్చేది యువరాజ్ సింగ్. 2007 టీ20 వరల్డ్‌కప్‌లో ఈ టీమిండియా మాజీ ఆల్‌రౌండర్.. ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో చెలరేగిపోయాడు. స్టువర్ట్ బ్రాడ్ వేసిన బౌలింగ్‌లో వరుసగా ఆరు బంతుల్లో ఆరు సిక్స్‌లు బాదాడు. అతని తర్వాత శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లోపూ కీరన్ పొలార్డ్ ఆ అరుదైన ఫీట్ సాధించాడు. ఇప్పుడు ఓ యువ ఆటగాడు టీ10లో ఆరు బంతుల్లో ఆరు సిక్స్‌లు కొట్టి.. టీ10 చరిత్రలో ఈ ఫీట్ సాధించిన తొలి ఆటగాడిగా నిలిచాడు. అతని పేరే కృష్ణ పాండే!

ప్రస్తుతం పాండిచ్చేరి టీ10 లీగ్‌ జరుగుతోంది. పేట్రియాట్స్, రాయల్స్ మధ్య శనివారం మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో పేట్రియాట్స్ తరఫున కృష్ణ పాండే ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. నితీష్ ఠాకూర్ వేసిన ఆరో ఓవర్‌లో.. ఆరు సిక్స్‌లు బాది పాండే విధ్వంసం సృష్టించాడు. కేవలం 19 బంతుల్లోనే ఇతడు 12 సిక్స్‌లు, 2 ఫోర్లతో 83 పరుగులు సాధించాడు. అయినప్పటికీ.. పేట్రియాట్స్ జట్టు 4 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన రాయల్స్.. నిర్ణీత 10 ఓవర్లలో 157 పరుగులు చేసింది. 158 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పేట్రియాట్స్.. 5 వికెట్ల నష్టానికి 153 పరుగులు చేయగల్గింది.

Exit mobile version