Kolkata Knight Riders Won The Match By 6 Wickets Against CSK: చెన్నై సూపర్ కింగ్స్‌పై కోల్‌కతా నైట్ రైడర్స్ ప్రతీకారం తీర్చుకుంది. చెపాక్ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో సీఎస్కేపై కేకేఆర్ ఘనవిజయం సాధించింది. సీఎస్కే నిర్దేశించిన 145 పరుగుల లక్ష్యాన్ని 18.3 ఓవర్లలోనే ఆరు వికెట్ల తేడాతో ఛేధించింది. కెప్టెన్ నితీశ్ రానా (57 నాటౌట్), రింకూ సింగ్ (54) కలిసి తమ జట్టుని విజయతీరాలకు చేర్చారు. ఆదిలోనే మూడు వికెట్లు కోల్పోయి, తీవ్ర కష్టాల్లో కూరుకుపోయిన తమ జట్టుని ఆ ఇద్దరు కాపాడుకున్నారు. సీఎస్కే బౌలర్లకు అడ్డంగా నిలబడిపోయి, చివరివరకు క్రీజులో నిల్చొని, తమ జట్టుని గెలిపించుకున్నారు. ఇంతకుముందు తమ హోమ్‌గ్రౌండ్‌లో తమపై గెలిచిన సీఎస్కేను.. ఇప్పుడు వారి హోమ్‌గ్రౌండ్‌లో వారిని ఓడించి తమ ప్రతీకారం తీర్చుకున్నారు.
Himanta Biswa Sarma: సెక్యులర్ సోదరులుగా ప్రకటించుకున్న వారు.. కేరళ స్టోరీ చూడండి
తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన సీఎస్కే జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 144 పరుగులు చేసింది. కేకేఆర్ బౌలింగ్ ఎటాక్‌కు సీఎస్కే కుప్పకూలగా.. శివబ్ దూబే (48 నాటౌట్) ఒక్కడే అద్భుతంగా రాణించాడు. డెవాన్ కాన్వే (30) సైతం పర్వాలేదనిపించాడు. మిగతా బ్యాటర్లందరూ విఫలం కావడంతో.. సీఎస్కే అంత తక్కువ స్కోరుకే పరిమితం అయ్యింది. అనంతరం 145 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్.. 18.3 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసి, విజయఢంకా మోగించింది. నిజానికి.. 33 పరుగులకే 3 వికెట్లు కోల్పోవడంతో, కేకేఆర్ జెండా ఎత్తేస్తుందేమోనని అందరూ అనుకున్నారు. సీఎస్కే బౌలింగ్ ఎటాక్‌కి, తక్కువ స్కోరుకే కుప్పకూలిపోతుందేమోనని భావించారు. లేకపోతే.. బ్యాటర్లను ఒత్తిడికి గురి చేసి, పరుగులు ఇవ్వకుండా కట్టడి చేస్తారేమోనని అంచనా వేశారు.
Spy Camera : యాజమానురాలి బెడ్‌రూంలో సీక్రెట్ కెమెరా పెట్టిన పనోడు
కానీ.. ఆ అంచనాలను రింకూ సింగ్, నితీశ్ రానా తిప్పేశారు. సీఎస్కే బౌలింగ్ ఎటాక్‌ని సమర్థవంతంగా ఎదుర్కొని, తమ జట్టుని ముందుకు నడిపించారు. లక్ష్యం చిన్నదే కావడంతో.. అనవసరమైన షాట్ల జోలికి వెళ్లకుండా, ఆచితూచి ఆడుతూ, వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు బాదుతూ వచ్చారు. నితీశ్ రానా 18 పరుగుల వద్దే ఔట్ అవ్వాల్సింది కానీ, పాతిరానా క్యాచ్ మిస్ చేయడంతో అతడు సేవ్ అయ్యాడు. వీళ్లిద్దరిని ఔట్ చేయడానికి సీఎస్కే బౌలర్లు ఎన్ని తంటాలు పడ్డా, ఫలితం లేకుండా పోయింది. ఈ క్రమంలో ఇద్దరు తమ అర్థశతకాలు పూర్తి చేసుకున్నారు. చివర్లో రన్ తీయడానికి వీలు లేకున్నా, రింకూ రన్ తీయబోయి రనౌట్ అయ్యాడు. ఇక ఫైనల్‌గా నితీశ్ విన్నింగ్ షాట్ కొట్టి, తన జట్టుని గెలిపించుకున్నాడు. చెన్నై బౌలర్లలో దీపక్ మూడు వికెట్లు తీశాడు.
