Site icon NTV Telugu

IPL 2022: కొత్త కెప్టెన్‌ను ప్రకటించిన కోల్‌కతా నైట్‌రైడర్స్‌

మార్చి నెలాఖరు నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్‌ సీజన్‌లో తమ జట్టును నడిపించే సారథిని కోల్‌కతా నైట్‌రైడర్స్ యాజమాన్యం ప్రకటించింది. శ్రేయాస్ అయ్యర్‌ను కొత్త కెప్టెన్‌గా నియమిస్తున్నట్లు వెల్లడించింది. ఇటీవల ముగిసిన వేలంలో శ్రేయాస్ అయ్యర్‌ను కోల్‌కతా నైట్‌రైడర్స్ రూ.12.25 కోట్లకు కొనుగోలు చేసింది. అతడు గతంలో ఢిల్లీ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. అయితే గత సీజన్‌లో గాయం కారణంగా కొన్ని మ్యాచ్‌లకు దూరంగా ఉన్నాడు.

కాగా కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టుకు ఇప్పటివరకు గంగూలీ, బ్రెండన్ మెక్‌కలమ్, గౌతమ్ గంభీర్, దినేష్ కార్తీక్, ఇయాన్ మోర్గాన్ వంటి ఆటగాళ్లకు కెప్టెన్‌గా వ్యవహరించారు. ఇప్పుడు ఈ జాబితాలో శ్రేయాస్ అయ్యర్ కూడా చేరబోతున్నాడు. అయితే కోల్‌కతా జట్టును ఓ సెంటిమెంట్ ఊరిస్తోంది. గతంలో ఢిల్లీ జట్టు నుంచి వచ్చిన గౌతమ్ గంభీర్ కోల్‌కతా జట్టుకు సారథిగా వ్యవహరించి రెండు టైటిల్స్ అందించాడు. ఇప్పుడు శ్రేయాస్ అయ్యర్ కూడా అదే సెంటిమెంట్‌ను రిపీట్ చేస్తాడని ఆ జట్టు యాజమాన్యం ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. అయ్యర్ 2020లో ఢిల్లీకి సారథ్యం వహించి ఫైనల్‌కు తీసుకెళ్లిన సంగతి తెలిసిందే.

Exit mobile version