టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఐపీఎల్ ఫ్రాంచైసీ రాయల్ చాలెంజర్స్ ఆఫ్ బెంగళూర్ కెప్టెన్ గా 2021 సీజన్ వరకు మాత్రమే కొనసాగుతానని విరాట్ కోహ్లీ ప్రకటించాడు. ఈ సీజన్ అనంతరం ఐపీఎల్ టోర్నీ లో కేవలం ఆటగాడిగానే కొనసాగుతానని స్పష్టం చేశాడు విరాట్ కోహ్లీ. తాను తీసుకున్న ఈ నిర్ణయాన్ని తన అభిమానులంతా స్వాగతిస్తారని అనుకుంటున్నానని పేర్కొన్నారు విరాట్ కోహ్లీ.
యూఏఈ వేదికగా జరిగే ఐపీఎల్ రెండో దశలో మరింత మెరుగైన ప్రదర్శన చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపాడు. తొలి దశలో ఎలా ఆడామో…. ఈ సారి కూడా అదే రీతిలో ఆడతామని స్పష్టం చేశాడు కోహ్లీ. రెండో దశలో కొంత మంది కీలక ఆటగాళ్లు దూరమైనా… తమకు వచ్చే ఇబ్బంది ఏమీ లేదన్నాడు. కాగా.. టీ20 వరల్డ్ కప్ అనంతరం… కూడా టీ20 కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకోనున్నట్లు ఇప్పటికే కోహ్లీ ప్రకటించిన సంగతి తెలిసిందే.
