ప్రపంచంలో అత్యంత ఆరాధించబడే టాప్-20 పురుషుల జాబితాలో విరాట్ కోహ్లి చోటు దక్కించుకున్నాడు. ఈ జాబితాలో కోహ్లి 18వ స్థానంలో నిలిచాడు. అయితే కోహ్లీ కంటే ముందు భారత ప్రధాని నరేంద్ర మోడీ, క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, బాలీవుడ్ నటులు షారుక్ ఖాన్, అమితాబ్ బచ్చన్ ఉన్నారు. ఈ జాబితాలో మోడీ 8వ స్థానంలో నిలవగా… ఎప్పుడో క్రికెట్ ను వదిలేసిన సచిన్ 12 వ స్థానంలో ఉన్నాడు. అలాగే షారుక్ ఖాన్, అమితాబ్ బచ్చన్ వరుసగా 14, 15 వ స్థానాల్లో నిలిచారు. అయితే ఈ 2021 సంవత్సరానికి గానూ ప్రతిష్టాత్మక యూగోవ్ సంస్థ నిర్వహించిన సర్వేలో అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా వరుసగా రెండో ఏడాది అగ్రస్థానంలో నిలిచాడు. మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్, చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ తర్వాతి స్థానంలో ఉన్నారు.
కోహ్లీని బీట్ చేసిన సచిన్… ఎందులో అంటే..?
