Site icon NTV Telugu

KL Rahul: కేఎల్ రాహుల్ వచ్చేశాడు.. ధావన్‌కు ఎసరు పెట్టేశాడు

Kl Rahul

Kl Rahul

KL Rahul: టీమిండియాకు శుభవార్త అందింది. ప్రతిష్టాత్మక ఆసియా కప్‌ టోర్నీకి ముందు కీలక ఆటగాడు కేఎల్ రాహుల్ అందుబాటులోకి వచ్చాడు. ఈనెల 18 నుంచి జింబాబ్వేతో జరగనున్న మూడు వన్డేల సిరీస్‌కు కేఎల్ రాహుల్‌ను ఎంపిక చేస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. మ్యాచ్ ప్రాక్టీస్ అవసరమైన దృష్ట్యా జింబాబ్వే టూర్‌కు కేఎల్ రాహుల్‌ను పంపాలని సెలక్టర్లు భావించారు. దీంతో జింబాబ్వేలో పర్యటించనున్న టీమిండియా కెప్టెన్‌గా కేఎల్ రాహుల్‌ను ప్రకటించారు. అయితే గతంలో ఈ టూర్‌కు కెప్టెన్‌గా ఎంపికైన శిఖర్ ధావన్ ఇప్పుడు వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. కేఎల్ రాహుల్ రాకతో ధావన్‌ను కెప్టెన్సీ నుంచి సెలక్టర్లు తప్పించారు.

Read Also: Team India: టీమిండియాకు షాక్.. టీ20 ప్రపంచకప్‌కు స్టార్ బౌలర్ దూరం?

ఐపీఎల్ తర్వాత కేఎల్ రాహుల్ గాయం బారిన పడటంతో ఇప్పటివరకు టీమిండియాకు దూరమవుతూ వచ్చాడు. అయితే గురువారం నిర్వహించిన ఫిట్‌నెస్ పరీక్షలో కేఎల్ రాహుల్ నెగ్గినట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. దీంతో జింబాబ్వే పర్యటనలో ఆడేందుకు అతడు అర్హత సాధించాడు. జింబాబ్వేలోని హరారే వేదికగా ఈనెల 18 నుంచి మూడు వన్డేలు జరగనున్నాయి. ఈనెల 18న తొలి వన్డే, 20న రెండో వన్డే, 22న మూడో వన్డే జరగనున్నాయి. ఈ మ్యాచ్‌లన్నీ భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 12:45 గంటలకు ప్రారంభం కానున్నాయి. ఈ సిరీస్ బ్రాడ్ కాస్టింగ్ హక్కులను సోనీ నెట్ వర్క్ ఛానళ్లతో పాటు ఆ సంస్థకు చెందిన ఓటీటీ ఫ్లాట్ ఫామ్ సోనీ లీవ్‌ దక్కించుకుంది. డీడీ స్పోర్ట్స్‌ ఛానల్‌లోనూ భారత్-జింబాబ్వే మ్యాచ్‌లు ప్రసారం కానున్నాయి.

జింబాబ్వే పర్యటనకు భారత జట్టు: కేఎల్ రాహుల్ (కెప్టెన్), శిఖర్ ధావన్ (వైస్ కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, శుభ్‌మన్ గిల్, దీపక్ హుడా, రాహుల్ త్రిపాఠి, ఇషాన్ కిషన్, సంజు శాంసన్, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, అవేష్ ఖాన్, ప్రసిద్ధ్ కృష్ణ, మహ్మద్ సిరాజ్, దీపక్ చాహర్

Exit mobile version