ముంబైలోని బ్రబౌర్న్ స్టేడియంలో ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ భారీ స్కోరు సాధించింది. టాస్ ఓడిపోయి తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది. కెప్టెన్ కేఎల్ రాహుల్ సెంచరీతో అదరగొట్టాడు. 56 బంతుల్లో 9 ఫోర్లు, 5 సిక్సర్లతో సెంచరీ పూర్తి చేశాడు. ఇన్నింగ్స్ చివరి వరకు నిలబడి 103 నాటౌట్‌తో నిలిచాడు. కేఎల్ రాహుల్‌కు డికాక్ (24), మనీష్ పాండే (38) తమ వంతు సహకారం అందించారు.
కేఎల్ రాహుల్‌కి ఇది మూడో ఐపీఎల్ సెంచరీ కావడం విశేషం. కెప్టెన్‌గా అతడికి ఇది రెండో సెంచరీ. ఓవరాల్‌గా ఐపీఎల్‌లో ముంబై జట్టుపై అతడు రెండో సెంచరీ సాధించాడు. కాగా.. లక్నో జట్టు భారీ స్కోర్ దిశగా దూసుకెళుతోంది. కాగా ఈ మ్యాచ్‌లో ముంబై గెలవాలంటే 200 పరుగులు చేయాలి. ఈ టోర్నీలో ముంబై ఇండియన్స్ తొలిసారి గెలుస్తుందా లేదా వరుసగా ఆరో మ్యాచ్‌లోనూ ఓడిపోతుందా అనే విషయం కాసేపట్లో స్పష్టం కానుంది. ముంబై ఓపెనింగ్ జోడీ రోహిత్, ఇషాన్ కిషన్ ప్రదర్శన ఈ మ్యాచ్ ఫలితాన్ని మార్చే అవకాశం ఉంది.
