Site icon NTV Telugu

IPL 2022: రాహుల్, హుడా హాఫ్ సెంచరీలు.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే..?

Kl Rahul

Kl Rahul

ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ జట్టు భారీ స్కోరు సాధించింది. ఈ మ్యాచ్‌లో లక్నో జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకోగా.. ఓపెనర్లు కేఎల్ రాహుల్ (77), డికాక్ (23) రాణించారు. తొలి వికెట్‌కు 42 పరుగుల భాగస్వామ్యం అందించారు. ముఖ్యంగా ఫామ్‌లో ఉన్న రాహుల్ స్వేచ్ఛగా బ్యాటింగ్ చేశాడు. 51 బంతుల్లో నాలుగు ఫోర్లు, ఐదు సిక్సర్ల సహాయంతో 77 పరుగులు చేసి తన జట్టుకు భారీ స్కోర్ అందించాడు. అతడికి దీపక్ హుడా (52) చక్కటి సహకారం అందించాడు. హుడా ఇన్నింగ్స్‌లో ఆరు ఫోర్లు, ఓ సిక్సర్ ఉన్నాయి. ఢిల్లీ బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ మూడు వికెట్లు పడగొట్టాడు. అయితే మిగతా బౌలర్ల నుంచి అతడికి సహకారం అందలేదు. ఈ మ్యాచ్‌లో గెలవాలంటే రిషబ్ పంత్ ఆధ్వర్యంలోనే ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు 196 పరుగులు చేయాలి.

Hardik Pandya: గుజరాత్ టైటాన్స్ సక్సెస్ సీక్రెట్ ఇదే..!!

Exit mobile version