IPL 2022 : చెలరేగిన రాజస్తాన్‌ రాయల్స్‌.. కేకేఆర్‌ ముందు భారీ స్కోరు

Kkr Vs Rr

Kkr Vs Rr

ఐపీఎల్‌ 2022లో భాగంగా సోమవారం రాజస్తాన్‌ రాయల్స్‌, కలకత్తా నైట్‌ రైడర్స్‌ మధ్య ఆసక్తికర పోరు జరుగుతోంది. కేకేఆర్‌ టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకుంది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన రాజస్తాన్‌ రాయల్స్‌ భారీ స్కోరు సాధించింది. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 217 పరుగుల చేసి కేకేఆర్‌ ముందు భారీ స్కోరు నిలిపింది. జాస్‌ బట్లర్‌(61 బంతుల్లో 103, 9 ఫోర్లు, 5 సిక్సర్లు) సీజన్‌లో రెండో సెంచరీ సాధించగా.. సంజూ శాంసన్‌ 38 పరుగులు చేశాడు. ఇక చివర్లో హెట్‌మైర్‌ 13 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 26 పరుగులతో మెరిశాడు. కేకేఆర్‌ బౌలర్లలో సునీల్‌ నరైన్‌ 2, శివమ్‌ మావి, పాట్‌ కమిన్స్‌, రసెల్‌ తలా ఒక​ వికెట్‌ తీశారు.