కోల్‌కత నైట్‌రైడర్స్ ఐపీఎల్ ఫైనల్‌కు చేరింది. రెండో క్వాలిఫైయర్ మ్యాచ్‌లో ఢిల్లీపై 3 వికెట్ల తేడాతో నెగ్గింది. చివరి ఓవర్ ఐదో బంతి వరకు ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్‌లో… కోల్‌కతాదే పైచేయి అయింది. విజయానికి రెండు బంతుల్లో ఆరు పరుగులు కావాల్సిన దశలో… కోల్‌కత బ్యాట్స్‌మెన్ రాహుల్ త్రిపాఠీ సిక్స్ కొట్టి జట్టును గెలిపించాడు. రేపు చెన్నై-కోల్‌కత మధ్య ఐపీఎల్ ఫైనల్ ఫైట్ జరగనుంది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ… 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 135 పరుగులు చేసింది. శిఖర్‌ధవన్, శ్రేయర్ అయ్యర్ మినహా ఢిల్లీ టీమ్‌లో ఎవరూ పెద్దగా స్కోరు చేయలేకపోయారు. దాంతో ప్రత్యర్థికి భారీ లక్ష్యాన్ని నిర్దేశించలేకపోయింది… ఢిల్లీ. కోల్‌కత బౌలర్లలో వరుణ్ చక్రవర్తి 2 వికెట్లు… ఫెర్గ్యూసన్, శివమ్ తలో వికెట్ పడగొట్టారు. 136 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన కోల్‌కతకు… ఓపెనర్లు శుభారంభం అందించారు.
తొలి వికెట్‌కు 96 పరుగులు జోడించారు. వెంకటేష్ అయ్యర్ హాఫ్ సెంచరీ చేయగా… శుభ్‌మన్ గిల్ 45 పరుగులు చేశారు. మ్యాచ్‌లో కోల్‌కత విజయం ఖాయం అనుకున్న దశలో ఢిల్లీ బౌలర్లు అనూహ్యంగా పుంజుకుని వరుస వికెట్లు తీసి కోల్‌కతపై ఒత్తిడి పెంచారు. 7 పరుగుల వ్యవధిలో ఏకంగా 5 వికెట్లు కోల్పోయింది… కోల్‌కత. వరుసగా కార్తీక్, మోర్గాన్, షకిబ్, నరైన్ డకౌట్ కావడంతో… మ్యాచ్ చూస్తున్న వాళ్లంతా ఎవరు గెలుస్తారోనని ఉత్కంఠగా ఎదురుచూశారు.
చివరి ఓవర్లో కోల్‌కత విజయానికి ఏడు పరుగులు కావాల్సి వచ్చాయి. అయితే ఢిల్లీ బౌలర్ అశ్విన్ తొలి నాలుగు బంతుల్లో ఒక్క పరుగే ఇచ్చి మూడు వికెట్లు తీశాడు. దాంతో కోల్‌కత విజయానికి చివరి రెండు బంతుల్లో ఆరు పరుగులు అవసరమయ్యాయి. రాహుల్ త్రిపాఠీ చివరి ఓవర్ ఐదో బంతిని సిక్స్ కొట్టగానే… కోల్‌కత జట్టు సంబరాలు చేసుకుంది. రేపు జరిగే ఫైనల్లో చెన్నైని ఢీకొనబోతోంది… కోల్‌కత. IPL టైటిల్‌ను చెన్నై ఇప్పటికే 3 సార్లు నెగ్గగా… కోల్‌కత రెండుసార్లు కైవసం చేసుకుంది. 2012లోనూ ఈ రెండు జట్ల మధ్యే ఐపీఎల్ ఫైనల్ జరగ్గా… కోల్‌కత టైటిల్ సాధించింది. రేపు జరిగే మ్యాచ్‌లో ఎవరు గెలుస్తారోనని ఫ్యాన్స్ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.